చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబరు 3కు వాయిదా..

ABN, First Publish Date - 2023-09-28T08:56:58+05:30 IST

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అక్టోబరు 3న విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. దీంతో చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు.

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అక్టోబరు 3న విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. దీంతో చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి ముందు మరోసారి పిటిషన్‌ను ప్రస్తావిస్తామన్నారు. 5నిమిషాల పాటు సమయమిస్తే చర్చించుకొని వస్తామని లూథ్రా కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు జస్టిస్‌ భట్టి సభ్యుడిగా లేని ఇతర ధర్మాసనం ఎదుట వచ్చే నెల 3వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో చేర్చాలని రిజిస్ట్రీని జస్టిస్‌ ఖన్నా ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T08:56:58+05:30