సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్..: చంద్రబాబు
ABN, First Publish Date - 2023-08-10T11:06:00+05:30 IST
పార్వతీపురం: ఉత్తరాంధ్రలో ప్రధానమైన ఐదు నదులను అనుసంధానం చేస్తే రైతాంగం కరువుబారి నుంచి బయటపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
పార్వతీపురం: ఉత్తరాంధ్రలో ప్రధానమైన ఐదు నదులను అనుసంధానం చేస్తే రైతాంగం కరువుబారి నుంచి బయటపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలో ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టినా వైసీపీ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా నాశనం చేసిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేసి పూర్తి చేసినప్పటికీ ఈ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో కనీస నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టలేదని చంద్రబాబు మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-10T11:06:00+05:30