వరద నీటి మధ్యలో చిక్కుకున్న బస్సు..

ABN, First Publish Date - 2023-07-24T11:34:37+05:30 IST

అల్లూరి జిల్లా: వరద నీటి మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. అల్లూరి జిల్లా, చింతూరు మండలం, కుయిగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కోయిగూరువాగు వంతెనపై...

అల్లూరి జిల్లా: వరద నీటి మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. అల్లూరి జిల్లా, చింతూరు మండలం, కుయిగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కోయిగూరువాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో మధ్యలో బస్సు నిలిచిపోయింది. సకాలంలో ప్రయాణీకులు బస్సు నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-24T11:34:37+05:30