బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు

ABN, First Publish Date - 2023-11-08T07:44:10+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థులను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదారాబాద్ కంపెనీలు బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసినట్లుగా రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని పరిశ్రమలు బెంగళూరుకు తరలి వెళతాయని మంత్రి కేటీఆర్ ఆరోపించడం హాట్ టాపిక్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-08T07:44:12+05:30