గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ మద్దతు
ABN, First Publish Date - 2023-12-13T10:54:46+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. స్పీకర్ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. స్పీకర్ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. కాగా స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్లు బుధవారం ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ కాపీని ప్రసాద్ కుమార్ అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-13T10:54:48+05:30