దుబ్బాక బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు..

ABN, First Publish Date - 2023-10-31T10:54:28+05:30 IST

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో సోమవారం బంద్ నిర్వహిస్తున్నారు. రాత్రికి రాత్రే దుకాణాలకు బంద్ పోస్టర్లు అతికించారు. వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో సోమవారం బంద్ నిర్వహిస్తున్నారు. రాత్రికి రాత్రే దుకాణాలకు బంద్ పోస్టర్లు అతికించారు. వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుబ్బాక పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి నిలవాలి కానీ.. దాడులు, హత్యలకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-31T10:54:28+05:30