పాఠశాలల్లో చిన్నారులకు ఇకపై సీఎం బ్రేక్ ఫాస్ట్
ABN, First Publish Date - 2023-10-06T11:28:45+05:30 IST
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు ఇకపై సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకం ప్రారంభించింది.
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు ఇకపై సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకం ప్రారంభించింది. మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రులు, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించగా.. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారెడుపల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చదువుకునే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సీఎం బ్రేక్ పాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ పథకం మెనూలో ఏఏ టిఫిన్లు ఉండనున్నాయో ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-06T11:28:45+05:30