శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటన
ABN, First Publish Date - 2023-10-26T11:59:07+05:30 IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతి, శ్రీకాళహస్తి కొనసాగుతోంది.
Tirupati Dist.: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో ఆమె పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో తంగెళ్లపాలెంలో మృతిచెందిన వెంకటరమణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిస్తారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-26T11:59:07+05:30