కేసీఆర్ నమ్మించి మోసం చేస్తున్నారు..

ABN, First Publish Date - 2023-06-22T11:05:59+05:30 IST

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ లబ్దికోసం ముఖ్యమంత్రి కొత్త ఎత్తులు వేస్తున్నారని, బీజేపీ నేతలు, ప్రధాని మోదీని తిడుతూ..

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ లబ్దికోసం ముఖ్యమంత్రి కొత్త ఎత్తులు వేస్తున్నారని, బీజేపీ నేతలు, ప్రధాని మోదీని తిడుతూ.. తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజల దృష్టి పడకుండా.. డైవర్టు చేసి.. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం 14 వందలమంది బలయ్యారని.. వారిని స్మరించుకునే స్థితిలో సీఎం కేసీఆర్ లేరని బండి సంజయ్ మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయంది.

Updated at - 2023-06-22T11:05:59+05:30