పోలీసుల తీరుపై బాలినేని ఫైర్..
ABN, First Publish Date - 2023-10-17T10:24:07+05:30 IST
ఒంగోలు: వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీకి బాలినేని లేఖలు రాశారు.
ఒంగోలు: వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీకి బాలినేని లేఖలు రాశారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల పనితీరును నిరసిస్తూ తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఓ ముఠా ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసి భూ కబ్జాలకు పాల్పడుతోంది. ఈ మేరకు పోలీసులు ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-17T10:24:07+05:30