నేటితో ముగియనున్న బాబు రిమాండ్ గడువు
ABN, First Publish Date - 2023-10-19T10:04:50+05:30 IST
సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణకు జరగనుంది. రెండు రోజుల క్రితం విచారణకు రావడంతో బాబు తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈరోజుకు వాయిదా వేసింది.
అమరావతి: సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణకు జరగనుంది. రెండు రోజుల క్రితం విచారణకు రావడంతో బాబు తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈరోజుకు వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఏసీబీ కోర్టు ఎదుట జైలు అధికారులు చంద్రబాబును ఆన్‌లైన్‌లో హాజరుపర్చనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాబు ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-19T10:04:50+05:30