నేడు అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా...?

ABN, First Publish Date - 2023-05-19T10:32:01+05:30 IST

హైదరాబాద్: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy) శుక్రవారం ఉదయం సీబీఐ (CBI) ఎదుట హాజరుకానున్నారు.

హైదరాబాద్: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy) శుక్రవారం ఉదయం సీబీఐ (CBI) ఎదుట హాజరుకానున్నారు. ఆయన అరెస్టు తప్పదని సీబీఐ అధికారులు ఇప్పటికే కోర్టుకు తెలిపిన దృష్ట్యా అవినాష్ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో మీడియాపై వైఎస్ అవినాష్ రెడ్డి మద్దతుదారులు రుబాబు ప్రదర్శిస్తున్నారు. వీడియోలు తీస్తే కెమెరాలు పగల గొడతామని ఆంధ్రజ్యోతి ప్రతినిధితో పాటు కెమెరామెన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఒక ఛానెల్‌ను మాత్రమే వీడియోలు తీయడానికి అనుమతిస్తామని అవినాష్ రెడ్డి మద్దతుదారులు అంటున్నారు. అవినాష్ ఇంటి వద్ద అనుచరులు ఓవరాక్షన్ చేయడం గమనార్హం. అవినాష్ సీబీఐ విచారణకు వెళుతున్న దృశ్యాలను కవర్ చేయొద్దంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-19T10:32:01+05:30