బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాష్..

ABN, First Publish Date - 2023-05-22T11:54:05+05:30 IST

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేష‌న్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన పిటిషన్ వినేలా ఆదేశించాలని, అవసరమైతే బెయిల్ ఇవ్వాలని కూడా కోరనున్నారు. ఒకవేళ బెయిల్ ఇవ్వని పక్షంలో హైకోర్టుకు వెళ్లి వెకేషన్ బెంచ్ ముందు తాము ప్రస్తావించే వరకు సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు.

గ‌తంలో హైకోర్టు వెకేష‌న్ బెంచ్‌ను త‌న బెయిల్ పిటిష‌న్ విచారించేలా ఆదేశించాల‌ని అవినాష్ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిష‌న్ విచార‌ణ తేదీని సుప్రీంకోర్టు ఖ‌రారు చేయ‌లేదు. జూన్ రెండోవారంలో విచార‌ణ‌కు అనుమ‌తిస్తామ‌ని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్నందున మ‌ళ్లీ సుప్రీం వెకేష‌న్ బెంచ్ ముందు త‌న బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ ఉంచారు. ఇక ఆయన పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు వివేకా కుమార్తె సునీత తరుఫు లాయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-05-22T11:54:05+05:30