నెల్లూరు: ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి
ABN, First Publish Date - 2023-06-05T11:16:11+05:30 IST
నెల్లూరు: ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు ఆగడంలేదు. ఆదివారం ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి జరిగింది.
నెల్లూరు: ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు ఆగడంలేదు. ఆదివారం ఏపీ టీడీపీ (TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy)పై దాడి జరిగింది. పది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆనం అనుచరులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నెల్లూరు (Nellore)లోని ఆర్టీయే కార్యాలయం (RTA Office) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యాలయం నుంచి ఆనం వస్తుండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆనం, ఆయన అనుచరులు దుండగులను ప్రతిఘటించడంతో పరారయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-05T11:16:11+05:30