గిరిజన యువకుడిపై అమానుషం...
ABN, First Publish Date - 2023-07-19T11:10:26+05:30 IST
ఒంగోలు: గిరిజన యువకుడిపై కొందరు పూటుగా మద్యం సేవించి అమానుషంగా ప్రవర్తించారు. గిరిజన యువకుడిని కూడా మద్యం తాగించారు. ఆ తర్వాత విచక్షణారహితంగా చావబాదారు. రక్తం కారుతున్న గాయాలతో బాధితుడు విలవిల్లాడుతున్నా..
ఒంగోలు: గిరిజన యువకుడిపై కొందరు పూటుగా మద్యం సేవించి అమానుషంగా ప్రవర్తించారు. గిరిజన యువకుడిని కూడా మద్యం తాగించారు. ఆ తర్వాత విచక్షణారహితంగా చావబాదారు. రక్తం కారుతున్న గాయాలతో బాధితుడు విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. వారిలోని పైశాచికత్వం అంతటితో ఆగలేదు. అతని నోట్లో మూత్రంపోసి తాగాలంటూ చితకబాదారు. తనను వదిలేయాలంటూ బాధితుడు బ్రతిమాలినా వారు వినిపించుకోలేదు. బూతులు తిడుతూ కసిగా కొట్టారు. మూత్రం పోసిన వ్యక్తి మర్మంగాన్ని నోట్లో పెట్టుకోవాలంటూ కొట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-07-19T11:10:26+05:30