మీబిడ్డనంటూ.. జగన్ పెద్ద డ్రామా.. : అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-10-20T13:02:41+05:30 IST

అమరావతి: ఎంతోమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారని, ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని.. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలనను ఇంతవరకు చూడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అమరావతి: ఎంతోమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారని, ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని.. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలనను ఇంతవరకు చూడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌కు, ఈ ప్రభుత్వానికి కర్రకాల్చి, వాతపెట్టి బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు సీఎం కొత్త డ్రామాకు తెర తీశారని, ప్రతి సమావేశంలో ‘నేను మీ బిడ్డను.. మా ఎస్సీలు.. మా ఎస్టీలు.. మా బీసీలు.. మా మైనాటీలు’ అంటూ కొత్త పల్లవిని వినిపిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Updated at - 2023-10-20T13:02:41+05:30