అవినాష్ గురించి అడిగినందుకు మీడియాపై ఏపీ స్పీకర్ ఫైర్..

ABN, First Publish Date - 2023-05-21T12:18:40+05:30 IST

శ్రీశైలం: సభను సజావుగా నడపాల్సిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం తెచ్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ అనే మాటలు ఎత్తగానే ...

శ్రీశైలం: సభను సజావుగా నడపాల్సిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం తెచ్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ అనే మాటలు ఎత్తగానే ‘నీకెందుకయ్యా అంటూ’ మీడియాపై సీరియస్ అయ్యారు. అవినాష్ పారిపోతే సీబీఐ చూసుకుంటుంది.. ‘నీకూ.. నాకూ పనేంటంటూ’ విచిత్ర సమాధానం చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లను దర్శించుకున్న సభాపతి తమ్మినేని.. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర అని ప్రశ్నించగానే ‘నీకు నేను చెప్పాలా? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-05-21T12:18:40+05:30