ఒడిశాలో మరో రైలు ప్రమాదం..

ABN, First Publish Date - 2023-06-05T12:18:24+05:30 IST

బార్గా: ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటన(Balasore Train Tragedy) మరువక ముందే సోమవారం ఉదయం మరో రైలు ప్రమాదం జరిగింది.

బార్గా: ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటన(Balasore Train Tragedy) మరువక ముందే సోమవారం ఉదయం మరో రైలు ప్రమాదం జరిగింది. బార్గా (Barga) సమీపంలో గూడ్స్ రైలు (Goods Train) పట్టాలు తప్పింది. ప్రమాదంలో ఐదు వ్యాగన్లు బోల్తాపడ్డాయి. లైమ్ స్టోన్‌ (Lime Stone)తో వెళుతున్న గూడ్స్ రైలు పడిపోయింది. అయితే ఎలాంటి ప్రాణహానీ జరగలేదు... కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి రైల్యే శాఖ ఇంకా ప్రకటించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

Updated at - 2023-06-05T12:18:24+05:30