మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్
ABN, First Publish Date - 2023-12-12T10:29:09+05:30 IST
నిజామాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని జీవన్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
నిజామాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని జీవన్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. ఆయన ఈ రుణాన్ని 2017లో తన భార్య రజితా రెడ్డి పేరుమీద తీసుకున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-12-12T10:29:10+05:30