రోజా నీ పూర్వ వీడియోలు చూడు: అనిత
ABN, First Publish Date - 2023-10-04T12:30:59+05:30 IST
విశాఖ: మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామాయేనని, అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితా అన్నారు.
విశాఖ: మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామాయేనని, అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితా అన్నారు. ‘రోజా నీ పూర్వ వీడియోలు చూడు... నువ్వు ఏమి మాట్లాడవో తెలుస్తుంది.. ఆడదానివన్న సంగతి ఇప్పుడే తెలిసిందా?.. రాష్ట్రంలో ఆడ పిల్లల మాన ప్రాణాలు పోతున్నా ఎవరూ స్పందించలేదని’ అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టారని... ఇపుడు మద్యం ఏరులై పారుతున్న ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో రోజా.. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు మీడియా ముందు అనిత ప్రదర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-04T12:30:59+05:30