అంగన్‌వాడీలపై పోలీసుల ఉక్కుపాదం..

ABN, First Publish Date - 2023-09-25T10:17:51+05:30 IST

విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఛలో విజయవాడకు అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను అరెస్టు చేస్తున్నారు.

విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఛలో విజయవాడకు అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బెజవాడకు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను అరెస్టు చేస్తున్నారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్నవారందరినీ ఒక కల్యాణమండపంలో ఉంచారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నాలుగేళ్లుగా హామీలు అమలు‌ చేయకపోగా, బిల్లులు కూడా ఇవ్వడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-25T10:19:59+05:30