మామ కోసం బరిలోకి అల్లు అర్జున్..

ABN, First Publish Date - 2023-08-19T10:50:01+05:30 IST

నల్గొండ జిల్లా: సినీ హీరో అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేయనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్‌ హాలును ప్రారంభిస్తారు.

నల్గొండ జిల్లా: సినీ హీరో అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేయనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్‌ హాలును ప్రారంభిస్తారు. చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రానున్నారు. కొన్నాళ్లుగా సాగర్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-19T10:50:01+05:30