actor Ali: ‘పవన్‌ కల్యాణ్‌ మీ మిత్రుడే కదా..!

ABN, First Publish Date - 2023-01-18T12:35:07+05:30 IST

జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై(Pawan Kalyan) పోటీకి సిద్ధమని సినీ నటుడు ఆలీ(Movie actor Ali) చెప్పారు. సీఎం

చిత్తూరు: జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై(Pawan Kalyan) పోటీకి సిద్ధమని సినీ నటుడు ఆలీ(Movie actor Ali) చెప్పారు. సీఎం జగన్‌(cm jagan) చెబితే పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా ఇంటికి మంగళవారం వచ్చిన ఆయన.. డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ మీ మిత్రుడే కదా..! ఆయనపై పోటీ చేస్తారా?’ అన్న మీడియా ప్రశ్నకు ఆలీ పైవిధంగా స్పందించారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ మిత్రుడైనా రాజకీయం వేరు. కుటుంబం, స్నేహం, రాజకీయాలు వేర్వేరు. రాష్ట్రంలోని 175 సీట్లలో వైసీపీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Updated at - 2023-01-19T22:13:09+05:30