టైటానిక్ చూసేందుకు వెళ్లారు.. సముద్రగర్భంలో చిక్కుకుపోయారు
ABN, First Publish Date - 2023-06-22T11:25:38+05:30 IST
వాషింగ్టన్: నూట పదకొండేళ్ల క్రితం తొలి ప్రయాణంలోనే ప్రమాదానికిగురై సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి ప్రయాణీకులతో సహా సముద్ర గర్భంలో గల్లంతైంది.
వాషింగ్టన్: నూట పదకొండేళ్ల క్రితం తొలి ప్రయాణంలోనే ప్రమాదానికిగురై సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి ప్రయాణీకులతో సహా సముద్ర గర్భంలో గల్లంతైంది. అమెరికాకు చెందిన ఓ టూరిజం కంపెనీ టైటాన్ అనే ఓ మినీ జలాంతర్గామితో పర్యాటకులను టైటానిక్ శిథిలాల దగ్గరకు తీసుకువెళుతుంది. మొత్తం ఐదుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉండే ఈ టైటాన్ మినీ సబ్‌మెరైన్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. అయితే సాధారణ సబ్ మెరైన్‌ల కాకుండా ఈ టైటాన్‌ను సముద్రంలోకి పంపడానికి.. వెలికి తీయడానికి పోలార్ ప్రిన్స్ అనే ఓ షిప్‌ను ఈ కంపెనీ ఉపయోగిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated at - 2023-06-22T11:25:38+05:30