ఆ పెన్ కనుమరుగవుతుందన్న పోస్టు చూసి బాధపడ్డ 19 కిడ్స్..

ABN, First Publish Date - 2023-08-28T14:01:29+05:30 IST

ప్రతి మనిషి జీవితంలో స్కూల్ డేస్ ఎంతో అపురూపమైనవి. బోలుడన్ని జ్ఞాపకాలు పోగేసుకునే రోజులవి. స్వార్థం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని ఆ వయసులో తోటి స్నేహితులపైనే కాదు.. కొన్ని వస్తువులపై కూడా మక్కువ పెంచుకుంటారు.

ABN Digital: ప్రతి మనిషి జీవితంలో స్కూల్ డేస్ ఎంతో అపురూపమైనవి. బోలుడన్ని జ్ఞాపకాలు పోగేసుకునే రోజులవి. స్వార్థం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని ఆ వయసులో తోటి స్నేహితులపైనే కాదు.. కొన్ని వస్తువులపై కూడా మక్కువ పెంచుకుంటారు. అలాంటి వాటిలో నటరాజ్ పెన్షిల్, అస్పర పెన్షిల్, రెనాల్డ్ పెన్స్ లాంటివి విద్యార్థి జీవితంలో తప్పకుండా ఉంటాయి. విద్యార్థి దశలో భావోద్వేగ బంధం పెనవేసుకున్న వాటిలో రెనాల్డ్ పెన్ ఒకటి. అంతటి ఎమోషన్ బాండింగ్ ముడిపడిఉన్న రెనాల్డ్ 045 బాల్ పెన్ తయారీని సదరు సంస్థ నిలిపివేస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అయింది. ఆ పోస్టు చూసినవాళ్లంతా ఆ పెన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదనను వెళ్లబుచ్చుతున్నారు. ఈ పెన్ ఇక కనుమరుగు అవుతుందన్న ఆ పోస్టు చూసి 19 కిడ్స్ బాధపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-28T14:01:29+05:30