నిద్రపోతున్న మహిళ మీదకు కారు సీన్ కట్ చేస్తే...
ABN, First Publish Date - 2023-08-08T12:39:38+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఓ మహిళ రహదారి పక్కన రోడ్డుమీద పడుకుంది. అప్పుడే అటువైపు ఓ కారు వచ్చింది. అది మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఆ కారును డ్రైవర్ ఒక్కసారిగా నిద్రిస్తున్న మహిళపైకి ఎక్కించాడు.
ఎన్టీఆర్ జిల్లా: ఓ మహిళ రహదారి పక్కన రోడ్డుమీద పడుకుంది. అప్పుడే అటువైపు ఓ కారు వచ్చింది. అది మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఆ కారును డ్రైవర్ ఒక్కసారిగా నిద్రిస్తున్న మహిళపైకి ఎక్కించాడు. వేరే ఎవరైనా అయితే ఈ ప్రమాదంలో చనిపోయేవారు. కానీ కారు ముందు టైర్ తన మీద నుంచి పోగానే ఆ మహిళ లేచి కూర్చుంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అనంతరం నొప్పితో బాధపడుతున్న ఆ మహిళను పరామర్శించిన కారు యజమాని ఆమెను కౌగిలించుకుని ఓదార్చాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బయటకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-08T12:39:38+05:30