కడుపులో 56 బ్లేడ్‌లు.. అలా ఎలా బతికావ్‌ బ్రో..

ABN, First Publish Date - 2023-03-15T23:02:51+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి కడపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లడంతో స్కాన్ చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు.

రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి కడపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లడంతో స్కాన్ చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న యస్‌పాల్ సింగ్ స్నేహితులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అయితే స్నేహితులు బయటకు వెళ్లాక అతడికి రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఎక్సేరే తీసిన డాక్టర్లు యువకుడి కడుపులో లోహపు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కడుపులో ఏం ఉన్నాయో తెలుసుకునేందుకు సోనోగ్రాపీతోపాటు ఎండోస్కోపీ నిర్వహించారు. ఎండోస్కోపీ రిపోర్టు చూసిన డాక్టర్లు యువకుడి కడుపులో బ్లేడు ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు యువకుడి కడుపులో నుంచి 56 బ్లేడు ముక్కలను తొలగించారు. ప్రస్తుతం యువకుడు యస్‌పాల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated at - 2023-03-17T13:18:32+05:30