వేసవిలోనూ జలకళ

ABN , First Publish Date - 2023-03-14T23:46:13+05:30 IST

ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటితో యాసంగిలోనూ బీడు భూములన్నీ ప చ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు యాసంగి లో సాగు చేయాలంటే చెరువుల్లో నీటి లభ్యతను చూసి రెవెన్యూ శాఖ తైబందీ చేసి వంతుల వారీగా రైతులకు వరి సాగుకు అవకాశం కల్పించేవారు. ఆరేళ్లుగా ఎస్సారె స్పీ నీరు, కాళేశ్వరం జలాల విడుదలతో మహబూబాబా ద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రూపురేఖలు మారిపోతు న్నాయి.

వేసవిలోనూ జలకళ

ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటితో నిండిన జలాశయాలు

యాసంగిలో పెరిగిన సాగు విస్తీర్ణం

30 ఏళ్ల బీడు భూముల్లోనూ పచ్చదనంతో కళకళ

రికార్డు స్థాయిలో నాలుగురేట్లు పెరిగిన వరి, మొక్కజొన్న సాగు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, మార్చి 14 : ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటితో యాసంగిలోనూ బీడు భూములన్నీ ప చ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు యాసంగి లో సాగు చేయాలంటే చెరువుల్లో నీటి లభ్యతను చూసి రెవెన్యూ శాఖ తైబందీ చేసి వంతుల వారీగా రైతులకు వరి సాగుకు అవకాశం కల్పించేవారు. ఆరేళ్లుగా ఎస్సారె స్పీ నీరు, కాళేశ్వరం జలాల విడుదలతో మహబూబాబా ద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రూపురేఖలు మారిపోతు న్నాయి. ఎస్సారెస్పీ, కాళేశ్వరం ద్వారా అనేక సార్లు నీటిని విడుదల చేస్తూ ఆయకట్టు ప్రాంతాల రైతులకు నీరు అందించడమే కాక చెరువులు కూడా నీటితో నింపు తుం డడంతో వ్యవసాయంలో చారిత్రాత్మక మార్పులు జరుగు తున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణం ఊహించని రీతి లో పెరుగుతోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న నాలుగు రేట్లకు పైగా పెరిగింది.

ఎస్సారెస్పీ నీరు విడుదలతో...

ప్రతి యాసంగికి ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా నీటిపా రుదల శాఖ విడతలవారీగా నీరు విడుదల చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా డీబీఎం-48, డీబీఎం-60 ప్రధాన కా లువలు ఉన్నాయి. డీబీఎం-48 కాలువ సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రారంభమై పర్వతగిరి, నెక్కొండ మీదుగా జిల్లాలోని ఇనుగుర్తి నుంచి కేసముద్రం, నెల్లికు దురు, చిన్నగూడూరు, మహబూబాబాద్‌, కురవి, సీరోలు డోర్నకల్‌ నుంచి ఖమ్మం రూరల్‌ జిల్లాకు విస్తరిస్తుంది. డీబీఎం-60 ప్రధాన కాలువ మైలారం రిజర్వాయిర్‌ నుంచి ప్రారంభమై వర్థన్నపేట మీదుగా పెద్దవంగర, దంతాలపల్లి, తొర్రూరు, మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం రూరల్‌ జిల్లాలో ప్ర వేశిస్తుంది. యాసంగి కోసం 56 రోజుల పాటు కాళేశ్వరం జలాలను జిల్లా నీటిపారుదల శాఖ విడుదల చేస్తోంది. మొత్తం జిల్లాలో 3,36,000 క్యూసెక్కుల నీటిని ఈ కాలు వల ద్వారా విడుదల చేస్తారు. గత జనవరి నెలలో ప్రా రంభమైన నీరు ఏప్రిల్‌ రెండో వారం వరకు నీటిని విడుదల చేస్తారు. డీబీఎం-48 కింద 1.18 లక్షల ఎకరాలు సాగవుతుండగా డీబీఎం-60 కింద 73 వేల ఎకరాలు సా గవుతుంది. ఆయకట్టు ప్రాంతాలకే ముందుగా ఎస్సా రెస్పీ, కాళేశ్వరం జలాలను నీటిపారుదల శాఖ విడుదల చేస్తుంది. అయితే కొన్ని మండలాల్లోని రైతులు చెరువుల ను కూడా నింపుకుంటున్నారు.

నిండుతున్న చెరువులు...

డీబీఎం-48 ప్రధాన కాలువ పరిధిలో 246 చెరువులు ఉండగా, అందులో 9 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. 75 చెరువులు 75 నుంచి 100శాతం వర కు, 94 చెరువులు 50 నుంచి 75 శాతం వరకు, 14 చెరు వులు 25 నుంచి 50 శాతం వరకు, 54 చెరువులు 0 నుంచి 25 శాతంతో అడుగంటిపోయాయి. డీబీఎం-60 పరిధిలో 118 చెరు వులు ఉండగా ఇప్పటి వరకు రెండు చెరువులు పూర్తిగా నిండగా, 24 చెరువులు 75 నుంచి 100 శాతం, 20 చెరువులు 50 నుంచి 75 శాతం, 42 చెరువులు 25 నుంచి 50 శాతం 30 చెరువులు 0 నుంచి 25 శాతం వరకు నీరు చేరుకుంది. వర్షాధార చెరువులు జిల్లాలో 373 ఉండగా, నాలుగు చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు, 48 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం వరకు, 148 చెరువులు 25 నుంచి 50 శాతం వరకు, 173 చెరువులు 0 నుంచి 25 శాతం వరకు నీరు చేరుకుంది.

రికార్డుస్థాయిలో విస్తీర్ణం పెరిగిందిలా...

జిల్లాలో 30 ఏళ్ల క్రితం యాసంగి కాలం లో చెరువుల్లో నీరు లేక తైబందీ చేసేవారు కాదు.. దీంతో అనేక ఎకరాల కొద్ది భూము లు వరి వేయకుండా బీడు భూములుగా మారిపోయేయి. కేవలం వర్షాధారంపైనే పం టలు పండించేవారు. అలాంటి ఈ భూము లు సైతం నేడు ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటి తో యాసంగిలో బీడు భూములన్ని పచ్చద నంతో పంటలు కళకళలాడుతున్నాయి. యా సంగిలో వరితో పాటు మొక్కజొన్న, పెసర పంటలతో కళకళలాడుతున్నాయి. ఈ కాలు వల పరిధిలో చెరువులు నిండుగా ఉంటూ జలకళను సంతరించుకుంటున్నాయి. 2018, 2019 సంవత్సరాల్లో వరి 35,660 ఎకరాల సాగు ఉండగా ఈ యాసంగి సీజన్‌లో 1,43,600 ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థా యిలో పెరిగిన ఈ విస్తీర్ణం నాలుగురేట్లు అ దనంగా పెరిగింది. అలాగే మొక్కజొన్న కూడా 10,295 ఎకరాల్లో ఉంటే పెరుగుతు.. తగ్గుతూ... 44,738 పెరిగింది. 2019లో వరి 1,15,140 ఎకరాలు, మొక్కజొన్న 51715 ఉం డగా 2020లో వరి 1,69,966 ఎకరాల్లో సా గు చేయగా మొక్కజొన్న 34,331 ఎకరాల్లో సాగు చేశారు. 2021లో వరి 1,24,031 ఎక రాల్లో, మొక్కజొన్న 28,538 ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో 1,43,600 ఎకరా ల్లో సాగు చేయగా మొక్కజొన్న 44,738 ఎక రాల్లో సాగు చేశారు. ఈ రెండు పంటలు దాదాపుగా నాలుగు రేట్లకు పైగానే పెరిగిం ది. వేరుశనగ విషయానికొస్తే కోతుల భ యంతో 13,970 ఎకరాల నుంచి 684 ఎకరా లకు తగ్గింది. పెసర పంట 1,502 ఎకరాల నుంచి 2,551 ఎకరాల వరకు పెరిగింది.

ఎస్సారెస్పీ నీటితోనే వ్యవసాయం చేస్తున్నా.. : కోరుకొండ హరిప్రసాద్‌, రైతు, చిన్నగూడూరు

గతంలో యాసంగిలో వరి సాగు చేయాలంటే కష్టతరంగా ఉండేది. అలాంటిది ఆరేళ్ల నుంచి మండలంలో, జిల్లాలోనూ ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తుండడంతో యాసంగిలో బీడు భూముల్లోనూ వరిసాగు అవుతుంది. యాసంగిలో ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నీరు అధికంగా ఉన్నప్పటికి కరెంట్‌ సమస్యగా ఉంది. అయినప్పటికీ పంట దిగుబడి బాగా వస్తుందని ఆశిస్తున్నా..

Updated Date - 2023-03-14T23:46:13+05:30 IST