దూప దీప నైవేద్యం పథకానికి 33 గ్రామాల ఆలయాలు ఎంపిక

ABN , First Publish Date - 2023-06-20T00:15:46+05:30 IST

రాష్ట్రంలోని గ్రామా ల్లో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం కింద ఆర్థిక సహకారం అందించడానికి దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు.

దూప దీప నైవేద్యం పథకానికి 33 గ్రామాల ఆలయాలు ఎంపిక

భూపాలపల్లిటౌన్‌, జూన్‌ 19: రాష్ట్రంలోని గ్రామా ల్లో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దూప దీప నైవేద్యం పథకం కింద ఆర్థిక సహకారం అందించడానికి దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. జిల్లాలోని 33 గ్రామా లకు చెందిన ఆలయాల్లో అర్చకులకు ఈ పథకం వర్తింప జేసిన ట్టు పేర్కొన్నారు. వీటిలో భూపాలపల్లి నియో జకవ ర్గంలో 24, మంథని నియోజకవర్గంలో తొమ్మిది ఆలయాలు ఉన్నాయి.

మహదేవపూర్‌ మండలంలోని బ్రాహ్మణవాడ, బెగుళూరు, సూరారం, మేడిగడ్డ గ్రామాల్లో భక్తాంజనేయస్వామి, అభయాంజనేయస్వామి, మల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నాయి. భూపాలపల్లి మండలం నాగారం, కొంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాల్లోని రామాంజనేయస్వామి, భక్తాంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. టేకుమట్ల మండలంలోని బండపల్లి, టేకుమట్ల, సుబ్బక్కపల్లిలోని లక్ష్మీగణపతి, భక్తాంజనేయస్వామి, అభయాం జనేయ స్వామి, కాటారం మండలంలోని పోతు ల్వాయి, శివాలయం, భక్తాంజనేయస్వామి ఆలయాలు, మల్హర్‌ మండలం నాచారంలోని మల్లికార్జునస్వామి ఆలయం, మహదేవపూర్‌ మండలం అన్నారంలోని రామానుజం దేవాల యం, గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలోని శ్రీరామలింగేశ్వరాస్వామి ఆలయం, మొగుళ్లపల్లి అంకుశాపూర్‌, కొర్కిశాలలోని భక్తాంజనేయస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.

Updated Date - 2023-06-20T00:15:46+05:30 IST