నేడు రెడ్ల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2023-06-01T00:42:37+05:30 IST

జూన్‌ 1న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడారు.

నేడు రెడ్ల ఆత్మీయ సమ్మేళనం
మాట్లాడుతున్న గోపు జైపాల్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి

వడ్డెపల్లి, మే 31: జూన్‌ 1న హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి తెలిపారు. బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడారు.

రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారని అన్నారు. అప్పటి నుంచి రెడ్డి కార్పొరేషన్‌ను సాధించుకునేందు కోసం రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ఛలో అసెంబ్లీ వంటి అనేక పోరాటాలు చేశామని అన్నారు. ఇప్పటి వరకు చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయలేదని అన్నారు.

ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.5వేల కోట్లు మంజూరి చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో తీర్మానించనున్నట్లు తెలిపారు. దీనికి వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి రెడ్డి కులస్థులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు రెంటాల కేశవరెడ్డి, గుర్రాల ప్రభాకర్‌రెడ్డి, రాధారపు సంజీవరెడ్డి, గంగిడి ప్రభాకర్‌రెడ్డి, కోరల్ల విద్యాసాగర్‌రెడ్డి, బిల్ల సుధీర్‌రెడ్డి, పత్తి సంపత్‌రెడ్డి, అర్జుల కిషన్‌రెడ్డి, రావుల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:42:37+05:30 IST