ఆరు గ్యారెంటీలకు తొలి అడుగు
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:34 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలో గురువారం ప్రజా పరిపాలన కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రజాపరిపాలనకు శ్రీకారం
అభయహస్తానికి అనూహ్య స్పందన
జిల్లావ్యాప్తంగా 10,658 దరఖాస్తులు
జనగామ పట్టణంలో తొలి రోజు 1,611 ఫారాలు
జనగామ టౌన్, డిసెంబరు 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలో గురువారం ప్రజా పరిపాలన కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లాలో జనగామ పట్టణంలోని నాలుగు వార్డులతో పాటు 37 గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. జిల్లాలో తొలి రోజు 10,658 దరఖాస్తులు వచ్చాయి. జనగామ నియోజకవర్గంలో 4,901, పాలకుర్తి నియోజకవర్గంలో 2,284, స్టేషన్‌ఘ న్‌పూర్ నియోజకవర్గంలో 3473 దరఖాస్తులు వచ్చా యి. పాలకుర్తి మండలం గోపాల పురంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె దేవరుప్పుల మండలం నర్సింగాపురం, కొడకండ్ల మండలం చిప్పరాలబండ తండాలో దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. జనగామ పట్టణంలోని రెండో వార్డుతో పాటు పెంబర్తి గ్రామం, దేవరుప్పుల మండలం బంజరపల్లి తండా, లింగాలఘణపురం మండలం నెల్లుట్ల, దేవరుప్పుల మండలం బంజారాలో కౌంట ర్లను కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ పిం కేశ్‌కుమార్ పరిశీలించారు. జనగామ పట్టణంలోని నాలుగు సెంటర్లతో పాటు మండలంలోని పెంబర్తి, వడ్లకొండలో దరఖాస్తుల స్వీకరణను డీసీసీ అధ్యక్షు డు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం పంపించగా.. ఇప్పుడున్న లబ్ధిదారులకు అవి సరిపోలేదు. దీంతో పలు చోట్ల జిరాక్స్ తీసిన దరఖాస్తు ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. మరికొన్ని చోట్ల లబ్ధిదారులు జిరాక్స్ సెంటర్లను ఆశ్రయించారు. ఒక్కో ఫారం జిరాక్స్ సెంటర్లలో రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయించారు. ఒక్కో చోట 6 నుంచి 8 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. క్యూలైన్లు కట్టాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులు సమర్పించుకున్నారు.
జనగామ పట్టణంలో..
జనగామ పట్టణంలోని నాలుగు వార్డుల్లో ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు పట్టణంలోని రెండో వార్డు ప్రిస్టన్ స్కూల్, 21వ వార్డు కురుమ సంఘం భవనం, 20వ వార్డు ఏకశిల స్కూల్, 11వ వార్డు డగ్లస్ స్కూల్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించగా మొదటి రెండు గంటల పాటు లబ్ధిదారులు ఎక్కువగా కనిపించారు. సాయం త్రం 6 గంటల వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రిస్ట న్ స్కూల్‌లో 8 కౌంటర్లు ఏర్పాటు చేయగా మిగతా సెంటర్లలో 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 11వ వార్డు లో 485, 21వ వార్డులో 433, 20వ వార్డులో 390, రెండో వార్డు 303 దరఖాస్తులు వచ్చాయి. మండలం లోని పెంబర్తి, వడ్లకొండలో కలిపి 777 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సెంటర్లలో దరఖాస్తు ఫారంలు సరి పోకపోవడంతో అధికారులు జిరాక్స్ తీయించి లబ్ధిదా రులకు అందజేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా గొడవలకు తావు లేకుండా ప్రజా పరిపాలన కార్యక్రమం విజయవంతమైంది. ఆయా వా ర్డుల కౌన్సిలర్లు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవే క్షించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ పట్టణంతో పాటు వడ్లకొండ, పెంబర్తిలో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. రెండో వార్డు ప్రిస్టన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను కలెక్టర్ శివలింగయ్య తనిఖీ చేశారు.