కేంద్రం వైఖరిని ఎండగట్టాలి
ABN , First Publish Date - 2023-04-03T23:52:06+05:30 IST
రాష్ట్ర విభజన చట్టం- 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగట్టాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివా్‌సరావు పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
జిల్లాలో కొనసాగిన ప్రజా పోరుయాత్ర
లింగాలఘణపురం, ఏప్రిల్3: రాష్ట్ర విభజన చట్టం- 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిని ఎండగట్టాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివా్‌సరావు పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుయాత్ర సోమవారం నెల్లుట్ల మీదు గా కుందారం, చీటూరు నుంచి పాలకుర్తి వైపు సాగింది. ఈ సందర్భంగా నెల్లుట్లలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన చట్టం-2014 ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయ్యారం ఉక్కుగనులు, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయానికి తగిన నిధుల కేటాయింపు, పోడు రైతులకు పట్టాలు, పేదలకు ఇళ్ల స్థలాలు తదితర హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ప్రజలు చైతన్యవంతులై కేంద్రప్రభుత్వం పక్షపాత వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, జిల్లా సహాయకార్యదర్శి పంజాల రమేశ్, ఆది సాయన్న, మంగళంపల్లి జనార్ధన్, సీపీఐ మండల కార్యదర్శి రావుల సదానందం, బర్ల అంజయ్య, యాదగిరి, వెంకన్న, అబ్బసాయిలు, వీరస్వా మి, మాచర్ల కుమార్ పాల్గొన్నారు.
చిలుపూర్: సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పో రుయాత్ర సోమవారం చిలుపూర్ గుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన ఎనిమిదిన్నరేళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాద్-జనగామ వరకు ఇండస్ర్టియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న ప్రజా పోరుయాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పైస రాములు, మోతె వెంకటయ్య, పిట్టల కుమార్, కొముర య్య, బండారి రాజ్‌కుమార్, మేకల రవి పాల్గొన్నారు.
పాలకుర్తి: బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పా టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, జనగామ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపో రు యాత్ర సోమవారం పాలకుర్తికి చేరుకోగా రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డారు. మోదీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు పెడుతోందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, కాజీపేట రైల్వే పరిశ్రమ,ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం కలగా మిగిలిపోయాయన్నారు. రాష్ట్రంలోని పోడు రైతులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వెం టనే నిలిపివేయాలని అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో విజయసారథి, మేకల రవి, కర్రె భిక్షపతి, కొలివి రాజ్‌కువర్, తోట మల్లికార్జునరావు పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారం రాత్రి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చేరుకుం ది. యాత్రను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పంజాల రమేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు కోసం, వరంగల్ జిల్లా సమగ్ర అభి వృద్ధి కోసం ప్రజాపోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో చేసిన హమీల ను విస్మరించారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పా లని పిలుపుచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విశ్వేశ్వరరావు, రాజిరెడ్డి, ఆదిసాయన్న, కర్రె భిక్షపతి, మండల కార్యదర్శి తోట రమేష్, సముద్రాల రాజు, చింత జగదీష్, బూర్ల యాదగిరి పాల్గొన్నారు.