ప్రారంభమైన శివాలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలు

ABN , First Publish Date - 2023-01-27T00:30:52+05:30 IST

మండలకేంద్రంలో ని గుట్టపై నూతనంగా నిర్మించిన పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠ ఉత్సవాలు గురువా రం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కల్లెడ గ్రామం నుంచి ట్రాక్టర్‌లో శివలింగం, ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామస్థులు కలశాలతో విగ్రహాల కు జలాభిషేకం నిర్వహించారు. మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఊరేగింపులో పాల్గొన్నారు. గు డి ఆవరణలో కలశపూజతోపాటు హోమం ప్రారంభించారు.

ప్రారంభమైన శివాలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలు


పర్వతగిరి, జనవరి 26: మండలకేంద్రంలో ని గుట్టపై నూతనంగా నిర్మించిన పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠ ఉత్సవాలు గురువా రం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కల్లెడ గ్రామం నుంచి ట్రాక్టర్‌లో శివలింగం, ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామస్థులు కలశాలతో విగ్రహాల కు జలాభిషేకం నిర్వహించారు. మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఊరేగింపులో పాల్గొన్నారు. గు డి ఆవరణలో కలశపూజతోపాటు హోమం ప్రారంభించారు. ఆర్డీఎఫ్‌ కళాశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థులచే చప్పట్ల తో శివనామస్మరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేడుకల సందర్భంగా భక్తులు తరలివస్తుండ డంతో పర్వతగిరిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేడుకల సందర్భంగా పర్వతగిరి ప్రధానకూడలితోపాటు గ్రామం నుంచి ఆల యానికి వెళ్లే దారిలో ఎటూ చూసినా ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఆలయంలో మూడురోజు ల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాల వి వరాలను ముద్రించిన ఫ్లెక్సీలతోపాటు ఆయా పార్టీలనాయకులు, చోటామోటా లీడర్లు ఏర్పా టుచేసిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు చివరిరోజు మంత్రి హరీష్‌రావు వస్తుండ డంతో పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. మండల కేంద్రంలోని రిజర్వాయర్‌లో బోటింగ్‌ ప్రారంభమైంది. శివాలయం ప్రారంభ వేడుకలను వచ్చిన భక్తులు సరదాగా బోటింగ్‌ చేశారు.

Updated Date - 2023-01-27T00:32:31+05:30 IST