ప్రగతిలో తెలంగాణ టాప్‌

ABN , First Publish Date - 2023-03-09T00:07:00+05:30 IST

స్వరాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేళ్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనలో సమగ్రాభివృద్ధి చెంది దేశంలో అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు.

ప్రగతిలో తెలంగాణ టాప్‌

పల్లె రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే..

దేశంలోనే నెంబర్‌ వన్‌ మంత్రి దయాకర్‌రావు

తొర్రూరు మునిసిపాలిటీకి రూ.25 కోట్లు

కొడకండ్లలో 20 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కు

తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్‌

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

అన్నారం క్రాస్‌రోడ్డు వద్ద హోరెత్తిన బహిరంగసభ

తొర్రూరు, మార్చి 8: స్వరాష్ట్రం సిద్ధించిన తొమ్మిదేళ్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనలో సమగ్రాభివృద్ధి చెంది దేశంలో అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో బుధవా రం వివిఽధ అభివృద్ధి నులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం అన్నారం క్రాస్‌రోడ్డు వద్ద మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో కేటీఆర్‌ మాట్లాడారు. 65 ఏళ్లలో సమైక్య పాలనలో కాని అభివృద్ధి తొమ్మిదేళ్ల కాలంలో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని అన్నారు. ఒకనాడు పట్టణాలకే పరిమితమైన పార్కులు నేడు పల్లెపల్లెనా ప్రకృతి వనాల పేరిట దర్శనమివ్వడం వెనుక సీఎం విజన్‌ ఉందని చెప్పారు. పల్లెకు ఏం కావాలో గుర్తించిన కేసీఆర్‌ అన్ని సమకూరుస్తున్నారని పేర్కొన్నారు. తాను ఏనుగల్లు పోయి వస్తున్నప్పుడు రైతును పలకరించి వ్యవసాయం ఎలా ఉందని అడిగితే కేసీఆర్‌ అంటే కే.. అంటే కాలువలు, సి.. అంటే చెరువులు, ఆర్‌.. అంటే రిజర్వాయర్‌లు అని, రైతుకు దన్నుగా నిలబడే నాయకుడే మన కేసీఆర్‌ అని గొప్పగా చెప్పారన్నారు.

దేశంలోనే నెంబర్‌ వన్‌ మంత్రి

భారతదేశంలోనే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అత్యుత్తమ మంత్రిగా పేరు సంపాదించుకున్నారని కేటీఆర్‌ కొనియాడారు. ఇది తాను చెబుతున్నది కాదని.. కేంద్రం ప్రకటించిన రిపోర్టుల్లో ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంసాద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన కింద 20 గ్రామపంచాయతీలు ఎంపికైతే అందులో 19 తెలంగాణలోనే ఉన్నాయన్నారు. గత ఆరు నెలల్లో త్రీస్టార్‌, ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌ కింద దేశంలో ఆరు జిల్లాలకు ర్యాంకులు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోనే నాలుగు ఉండడం విశేషమన్నారు.

గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు, ఉపసర్పంచ్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్‌ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. దేశంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, సీఎం కేసీఆర్‌కు మంచిపేరు ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రజా నాయకులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని కోరారు.

నాడు రైతులు బ్యాంకు రుణాలు కట్టకపోతే అధికారులు ఇంటి తలుపులు, కిటికీలు గుంజుకుపోయే సంఘటనలున్నాయని, నేడు తెలంగాణ ప్రభుత్వంలో రైతులే బ్యాంకులకు వెళ్లి రుణాలు చెల్లిస్తున్నారన్నారు. రూ.65వేల కోట్ల రైతుబంధు డబ్బులను అన్నదాతల ఖాతాల్లో వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. తొర్రూరు మునిసిపాలిటీ అభివృద్ధికి మరో రూ.25కోట్లు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.

కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుకు దిక్కులేదు..

విభజన హామీలు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటు దిక్కులేకుండా పోయిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాజీపేటలో ఏర్పాటు చేస్తానన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు దాని ఊసే లేదని, ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయించినా దానికి అతీగతి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

కేటీఆర్‌ తన పర్యటనలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మునిసిపల్‌ కేంద్రంలో రూ.4 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మోడల్‌ మార్కెట్‌, రూ.2.13 కోట్లతో ఏర్పాటు చేసిన యతిరాజారావు పార్కును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆపై రూ.3.75 కోట్లతో ఏర్పాటు చేయనున్న డివైడర్లు, రూ.5 కోట్లతో నిర్మించతలపెట్టిన ఇండోర్‌ స్టేడియంకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అన్నారం క్రాస్‌రోడ్డు వద్ద సభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అభయహస్తం నిధులు, పావలా వడ్డీ రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి రూ.1550 కోట్ల నిధుల చెక్కులను విడుదల చేశారు. ఆ తర్వాత మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతిభ కనబర్చిన ఐదుగురు మహిళలను సత్కరించారు. అంతకుముందు పట్టణంలో మంత్రి కేటీఆర్‌ ఓపెన్‌ టాప్‌ కారులో వస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.

ఈకార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్ర కాష్‌, వరంగల్‌, మానుకోట ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలో తు కవిత, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్‌, బానోత్‌ శంకర్‌ నాయ క్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌, దా స్యం వినయ్‌ భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, బస్వరాజు సారయ్య, జీడబ్ల్యుఎంసీ మేయర్‌ గుం డు సుధారాణి, నాగుర్ల వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి ట్రస్టు చైర్మన్‌ ఉషా దయాకర్‌ రావు, మునిసిపల్‌ శాఖ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సు ల్తానియా, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి సత్యనారాయణ, జి ల్లా కలెక్టర్‌ శశాంక, ఆర్డీవో రమేష్‌, ఎంపీటీసీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, అనుమాండ్ల దేవేందర్‌ రెడ్డి, సోమేశ్వర్‌ రావు, సీతారాములు, బిందు, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-03-09T00:07:00+05:30 IST