దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

ABN , First Publish Date - 2023-06-03T00:28:26+05:30 IST

సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

సమగ్రాభివృద్ధికి ప్రతీ ఒక్కరు ప్రతిన బూనాలి

ఎండాకాలంలోనూ నిండుకుండల్లా చెరువులు

రూ.840 కోట్లతో ఇంటింటికీ తాగునీరు

రూ.190 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం

‘మన ఊరు-మన బడి’ స్కూళ్లలో వసతుల కల్పన

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

జనగామ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గు ర్తు చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలపాలన్నారు. బంగా రు తెలంగాణ సాధన దిశగా ప్రతీ ఒక్కరు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం, జిల్లాల ఏర్పాటు తర్వాత జనగామ ప్రాంతం విశేష అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఒకప్పుడు జనగామ ప్రాంతంలో నెర్రెలుబారిన చెరువులు ఇపుడు వేసవిలోనూ నిండుకుండల్లా కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 77,262 ఎకరాలకు సాగునీ రు అందగా ప్రస్తుతం 4.51 లక్షల ఎకరాలకు అందు తోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2071 రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.103.55 కోట్లు అందించామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 16,275 మందికి రూ.210.65 కోట్ల విలువైన గొర్రెలను అందించామని తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 3636 ఎకరాల్లో సాగు చేయిం చామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.8.31 కోట్ల విలువైన చేప పిల్లలను ఉచితంగా అందించామ న్నారు. తెలంగాణ వచ్చాక జిల్లాలో రూ.840 కోట్ల వ్యయంతో 1284 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ల ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. జిల్లా ఆసుపత్రిలో రూ.48 లక్షలతో అత్యాధునిక మార్చురీ భవనాలు, రూ.60 లక్షలతో రేడియాలజీ విభాగం, రూ.54 లక్షలతో బచ్చన్నపేట, పాలకు ర్తిలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ పనులను చేపట్టామన్నారు. జనగామలో 190 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మిస్తున్నామ ని, ఇందుకోసం 23.10 ఎకరాల కేటాయించామని తెలిపారు. అదే విధంగా రూ.23.50 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను చేపట్టామన్నారు. జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద ఇప్పటి వరకు 19,722 మందికి రూ.179.98 కోట్లు అందించామన్నారు. జిల్లాలో 567 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పా టు కోసం రూ.3.66 కోట్లు ఇచ్చామన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోవ డం గర్వంగా ఉందన్నారు. జిల్లాలో 579 మంది నాయి బ్రాహ్ముణులకు, 1637 మంది రజకులకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నా రు. జిల్లాలోని 98 సంక్షేమ హాస్టళ్లతో పాటు 488 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలనెలా 239 మెట్రిక్‌ టన్ను ల సన్నరకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపా రు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 517 పాఠశాలలను ఎంపిక చేసి రూ.175.37 కోట్లతో వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులను ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడం కోసం రూ. 71 కోట్లతో బమ్మెర, పాలకుర్తి, వల్మిడి, పెంబరి, ఖిలాషా పూర్‌, జఫర్‌గడ్‌లో పనులను చేపట్టామన్నారు. వేడుకల్లో కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మె ల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అమరవీరులకు నివాళి.. జెండావిష్కరణ

అవతరణ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్‌లో వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాళ్లు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. నృత్యాలు చేసిన చిన్నారులతో ఫొటోలు దిగి వారిని అభినందించారు. అనంతరం విజయడెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను వీక్షించారు.

Updated Date - 2023-06-03T00:28:26+05:30 IST