ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీతక్క
ABN , First Publish Date - 2023-06-11T00:19:36+05:30 IST
కల్లాల్లో ఉన్న ధాన్యం తోపాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొను గోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గోవిందరావుపేట, జూన్ 10: కల్లాల్లో ఉన్న ధాన్యం తోపాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొను గోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మండల వర్కింగ్ అధ్యక్షుడు రస్పూత్ సీతారాంనాయక్ ఆధ్వర్యం లో మండలంలోని రాఘవపట్నంలో కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆమె శనివారం పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్నా ఇంకా రబీ ధాన్యం కొనుగోలు, తరలిం పు జరగడంలేదని విమర్శించారు. వెంటనే కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు పంటలు నష్టపోతే పరిహారం, పంట ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కొను గోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరచడానికి సరైన వసతు లు కల్పించక, తరుగుపేరుతో రైతును దగా చేస్తున్న మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, ఆపన్నహస్తం అందించకుండా, ధాన్యం సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. రైతుల కష్టాలు, నష్టాలను అంచనా వేసి ప్రభుత్వంతో నష్టపరి హారం ఇప్పించాల్సిన అధికారులు అధికార పార్టీ ఉత్సవా లు, సమావేశాలకు జనాన్ని తరలిస్తూ బానిసలుగా బతకడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పుట్టెడు కష్టాల్లో అన్నదాతలు ఉంటే ఆదుకోవాల్సిందిపోయి ఉత్సవాల్లో పాల్గొనడం అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి, నాయకులు కోరం రామ్మోహన్, ఈక శేషు, వంశీ ఉన్నారు.