బైక్‌ను ఢీకొన్న బొగ్గు టిప్పర్‌

ABN , First Publish Date - 2023-08-22T00:18:38+05:30 IST

బైక్‌ను బొగ్గు టిప్పర్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని మేడిపల్లి సమీపంలో 353(సీ) జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకొంది.

బైక్‌ను ఢీకొన్న బొగ్గు టిప్పర్‌
టైర్ల కింద రెండు ముక్కలైన పోచయ్య మృతదేహం

రెండు ముక్కలై ప్రాణాలు వదిలిన ద్విచక్రవాహనదారుడు

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు

కాటారం, ఆగస్టు 21: బైక్‌ను బొగ్గు టిప్పర్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని మేడిపల్లి సమీపంలో 353(సీ) జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటు చేసుకొంది. కాటారం ఎస్సై అభినవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన బీసుల పోచయ్య(45), అదే గ్రామానికి చెందిన సుశాంత్‌ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు బైక్‌పై భూపాలపల్లికి బయల్దేరారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్‌ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. దీంతో పోచయ్య ఎగిరి టిప్పర్‌ టైర్ల మధ్యలో పడటంతో రెండు ముక్కలుగా మారి అక్కడికక్కడే మృతిచెందాడు. సుశాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, బంధువులు ఆందోళ నకు దిగగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో వారు శాంతించారు.

Updated Date - 2023-08-22T00:19:34+05:30 IST