Share News

పోలింగ్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2023-12-01T00:16:29+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ భూపాలపల్లి నియోజకవర్గంలో మందకొడిగా ప్రారంభైన పోలింగ్‌ సాఫీగా సాగింది. మొత్తం 317 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.02 శాతం నమోదైంది. పలు చోట్ల ఈవీ ఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు వాటిని మార్చి ఓటింగ్‌ కొనసాగించారు.

పోలింగ్‌ ప్రశాంతం
భూపాలపల్లిలో మొదటి ఓటు వేసిన యువతి

మందకొడిగా ప్రారంభమై..

భూపాలపల్లి నియోజకవర్గంలో 81.02 శాతం

4 చోట్లా మొరయించిన ఈవీఎంలు.. మార్చిన అధికారులు

4 గంటల తర్వాత వెనుదిరిగిన ఓటర్లు

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబరు 30: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ భూపాలపల్లి నియోజకవర్గంలో మందకొడిగా ప్రారంభైన పోలింగ్‌ సాఫీగా సాగింది. మొత్తం 317 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.02 శాతం నమోదైంది. పలు చోట్ల ఈవీ ఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు వాటిని మార్చి ఓటింగ్‌ కొనసాగించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ చెదురు మొదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగింది. సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వారికి అధికా రులు ఓటు వేయడానికి అవకాశం ఇచ్చారు.

మొదట్లో ఓటర్ల జోరు..

ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఓటర్లు బారులు తీరా రు. కూలినాలి, ఇతర పనులు చేసు కొని జీవించే వారు పొద్దున్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కటట్టారు. ముఖ్యం గా మహిళా ఓటర్లు పురుషుల కంటే ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు వినియోగించుకునేందుకు మక్కువ చూపారు. ఉద యం 9 గంటల వరకు 10 శాతం, 11 గంటల వరకు 27.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటల కు 49.12 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ సరళి భిన్నంగా మారింది. మధ్యాహ్నం వరకు 49.12 శాతం మంది ఓటేస్తే సాయంత్రం 5 గంటల వరకు 26.98 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటింగ్‌ టైంపై అవగాహన లేకే.

పోలింగ్‌ సమయం సాయంత్రం 5 గంటల వరకు ఉందనుకున్న ఓటర్లు 4 గంటల తర్వాత చేరుకొని నిరా శతో వెనుదిరిగారు. భూపాలపల్లి నియోజవర్గంలో సా యంత్రం 4 గంటలకు ముగుస్తుందని ప్రచారం చేయ డంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే వెనుదిర గాల్సి వచ్చిందనే విమర్శలు వచ్చాయి. గ్రామాల్లో కొంద రు వ్యవసాయ కూలీలు సాయంత్రం పనికి వెళ్లి వచ్చా క 4 గంటల తర్వాత ఓటేద్దామనుకున్నారు. తీరా పోలింగ్‌ స్టేషన్‌కు చేరాక సమయం ముగిసిందని అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు.

మొరాయించిన ఈవీఎంలు

భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. మొత్తం నాలుగు చోట్లా అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు ఈవీఎంలను మార్చారు. చిట్యాల మండలంలోని రాంచంద్రపూర్‌(108), రేగొండ మండలంలోని తిరుమల గిరి(219), మొగుళ్లపల్లి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి(185), మొట్లపల్లి(186) పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల వాటి స్థానంలో రిజర్వ్‌లో ఉన్న వాటిని అమర్చారు. అలాగే భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మంజూర్‌నగర్‌ 79వ పోలింగ్‌ బూత్‌లో సాంకేతిక సమస్య వల్ల పోలింగ్‌ నిలిచిపోయింది. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి పోలింగ్‌ చేపట్టారు.

- చెదురుముదురు సంఘటనలు మినహా..

భూపాలపల్లి నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం, చిట్యాల మండలాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు ఘర్షణలకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదురుగొట్టారు.

Updated Date - 2023-12-01T00:16:33+05:30 IST