ఓరుగల్లు ఉద్యమాల గడ్డ

ABN , First Publish Date - 2023-06-03T00:18:58+05:30 IST

తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్‌ జిల్లా కీలక పాత్ర పోషిం చిందని, ఇది ఉద్యమాల గడ్డ అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాష్‌ అన్నారు.

ఓరుగల్లు ఉద్యమాల గడ్డ

ప్రగతి పథంలో జిల్లా పయనం

రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాష్‌

వరంగల్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

అలరించిన సాంస్కృతిక కార్కక్రమాలు

వరంగల్‌ కలెక్టరేట్‌, జూన్‌ 2: తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్‌ జిల్లా కీలక పాత్ర పోషిం చిందని, ఇది ఉద్యమాల గడ్డ అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాష్‌ అన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరం గల్‌లోని ఐడీవోసీ ఇంటి గ్రేడ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ కాం ప్లెక్స్‌ స్థలంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథి బండా ప్రకా ష్‌కు కలెక్టర్‌ ప్రావీణ్య, ఎమ్మె ల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రగతిని వివరించారు.

తలసరి ఆదాయం 2014–15లో రూ.82,084 ఉండగా, 2020–21కి రూ.1,71,111 పెరిగిం దన్నారు. జిల్లాలో రైతు బంధు ద్వారా 2018 వర్షాకాలం నుంచి ప్రతీ సంవత్సరంలో రెండు సీజన్లలో ఎకరానికి రూ.5వేల చొప్పున అర్హులైన రైతులకు వారి ఖాతాల్లో ఇప్పటివరకు రూ. 1204.105 కోట్లు జమ చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, రైతు బీమా 2018 ఆగస్టు 15న ప్రారంభం కాగా ఇప్పటి వరకు 1,970మంది రైతులు మరణించగా, ఆ కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ. 98.05 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.

ఆరోగ్య శాఖ..

జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంజీఎం, సీకేఎం, ఆర్‌ఈహెచ్‌, వరంగల్‌ సీఎస్‌ఈ, వర్ధన్నపేట, నర్సంపేట ఆరోగ్య ఉపకేంద్రాలు 118, పల్లె దవాఖానాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలందించడం జరుగుతుం దన్నారు. జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా 51,696 మందికి రూ.40.15 లక్షలతోపాటు కేసీఆర్‌ కిట్స్‌ 58వేలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కంటి వెలుగు ద్వారా 7,82,069 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

విద్యా శాఖ..

జిల్లాలో విద్యా అభివృద్ధి కోసం మన ఊరు– మన బడి, మన ఊరు– మనబస్తీ కార్యక్ర మం ద్వారా జిల్లాలో 645 పాఠశాలలకు మొదటి విడతగా రూ.105.17 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిం దన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా 52,057 మంది పిల్లలకు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. గ్రంథాలయాల బలోపేతానికి రాబోయే విద్యా సంవత్సరం లో గ్రంథాలయాల ద్వారా పుస్తకాలు సరఫరా జరుగుతోంది ప్రకాష్‌ వివరించారు. జిల్లాలో పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుటకు పల్లె ప్రగతి కార్యక్ర మం ద్వారా రూ. 16.06 కోట్లతో ప్రతీ గ్రామానికి ట్రాక్టర్‌, ఒక ట్యాంకర్‌, ట్రాలీ, తడిపొడి చెత్త సేకరణకు డంపింగ్‌ యాడ్స్‌, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జలాల పెంపుకోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హరిత హారం ద్వారా మొక్కలు నాటి పెంచడం తో పర్యావరణ రక్షణకు జిల్లాలో 21,155. 998 మొక్కలను నాటడం జరిగిందన్నారు.

పర్యాటక రంగం..

పర్యాటక ప్రాంతా లుగా జిల్లాలో పాకాల సరస్సు వద్ద రూ.1.20 కోట్లతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం. కొమ్మాల లక్ష్మినర్సిహ స్వామి ఆల య అభివృద్ధికి రూ.29లక్షలు, వరంగల్‌లో పురావస్తు ప్రదర్శనశాల నిర్మాణం కొరకు రూ. 4కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. జిల్లాలో ఆసరా పింఛన్ల కింద వృద్ధాప్య, చేనేత, వికా లాంగ, వితంతు, బీడి కార్మికులు, ఒంటరి మహిళ పింఛ న్లు మొత్తం 1,26,734 మందికి మంజూరి చేయడం జరిగిందన్నారు.

స్కాలర్‌షిప్స్‌..

షెడ్యూల్‌ కులాల అభివృద్ధికి ఫ్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ 13,158 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.15కోట్ల 78లక్షల 96వేలు పోస్టు మెట్రిక్‌ కింద అందజేయడం జరిగిందన్నారు. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనం కింద రూ.10కోట్ల 546లక్షల 94 మంజూరు చేయడం జరిగిందన్నారు. అంబేద్కర్‌ విద్యానిధి కింద 22 మంది ఎస్సీ విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.4కోట్ల 46లక్షల 86వేల 400 మంజూరు చేయడం జరిగిం దన్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే విదే శీ విద్యానిధి కింద 35మంది విద్యా ర్థులకు రూ. 6.40 కోట్లను అందిం చడం జరిగిందన్నారు. సీఎం ఓవర్‌ సిస్‌ స్కాలర్‌షిప్‌ కింద 10 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.20 లక్షలు అందించడం జరిగిందని పేర్కొన్నారు.

దళిత బంధు..

జిల్లాలో 303 యూనిట్లకు రూ. 30.30 కోట్లు కేటాయించి గ్రౌండ్‌ చేయడం జరిగింద న్నారు. ఆలాగే, గిరిజనుల సంక్షేమం కోసం పో డు భూమి అటవీ హక్కుల చట్టం ద్వారా 3,353 దరఖాస్తులు రాగా 3,271 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలను మంజూరి చేశారు.

టెక్స్‌టైల్‌ పార్కు..

జిల్లాలో పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కును 1200 ఎకరాల్లో ఏర్పాటు చేయగా నిరుద్యోగ యు వకులకు బాసటగా నిలిచిందన్నారు. ఈపార్కు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలో పంచాయతీ రాజ్‌ శాఖ, పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మత్స్య శాఖ, పరిశ్రమల కేంద్రం, ఉధ్యాన వన శాఖ, విద్యుత్‌ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, మిషన్‌ భగీరథ, మార్కెటింగ్‌ శాఖ, ఎక్సైజ్‌ శాఖ, పోలీసు శాఖ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆరోగ్య లక్ష్మి, సఖీ సెంటర్‌ లాంటి కార్యక్ర మాలను జిల్లాలో ప్రభుత్వం అన్ని శాఖల నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసి జిల్లాను అభివృద్ధి పథంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది.

ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం..

గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఏడు శాఖల స్టాల్స్‌ను ప్రకాష్‌ సందర్శించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి ఇతర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో స్టాల్స్‌ను ఆసక్తి గా తిలకించారు. వివిధ శాఖల్లో సేవలందించిన ఉద్యో గులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్ర మంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్‌రెడ్డి, వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, అడిషనల్‌ కలెక్టర్లు కె.శ్రీవత్స, అశ్వినితానాజీ వాకడే, ఆర్‌డీవో మహేందర్‌జీ, అధికారులతో పాటు పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:18:58+05:30 IST