నల్లెల కుమారస్వామి ఇకలేరు
ABN , First Publish Date - 2023-02-24T00:13:22+05:30 IST
కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమా రస్వామి(60) గురువారం మృతిచెందా రు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విష మించి ములుగులోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
ములుగు, ఫిబ్రవరి 23: కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమా రస్వామి(60) గురువారం మృతిచెందా రు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విష మించి ములుగులోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య విజ య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారస్వామి మరణ వార్త తెలిసి ప్రజలు, ఆయన సన్నిహితులు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుమార స్వామి మరణంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో దిగ్ర్భాం తి వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన కుమారస్వామి మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు.
కుమార్ మృతదేహం వద్ద ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క శ్రద్ధాం జలి ఘటిస్తూ భోరున విలపించారు. కుమార్ మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభి వృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేంద ర్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు, జనగామ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రొఫెసర్ కూర పాటి వెంకటనారాయణ తదితరులు కుమారస్వామి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మరణ వార్త విన్న ములుగు వ్యాపారులు గురువారం స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు.
పాడె మోసిన సీతక్క..
నల్లెల కుమారస్వామి అంత్యక్రియలు గురువారం రాత్రి ముగిశాయి. అభిమాన నాయకుని కడసారి చూ పుకోసం జనం వందలాదిగా తరలివచ్చారు. కుమారస్వామి పాడెను ఎమ్మెల్యే సీతక్క మోసారు.
మాస్ లీడర్‌గా గుర్తింపు
నల్లెల కుమారస్వామి ములుగు జిల్లాలో అజాత శ త్రువుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీ తం గా ఆయన అందరితో సన్నిహితంగా మెదిలేవారు. పలు ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా మొదలైన ప్రస్థానంలో ఆయన ప్రజా నాయకుడిగా ఎదిగారు. ములుగు సర్పం చ్‌గా, ఎంపీపీగా పనిచేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం త ర్వాత కేసీఆర్‌తో కలిసి నడిచారు. ఆయన కు అత్యంత సన్నిహితుడిగా మారారు. తీవ్రమైన తాగు నీటి ఎద్దడి ఉన్న ములుగు పట్టణానికి రామప్ప సరస్సు నుంచి రక్షి త మంచినీటిని సరఫరా చేయాలని ఆమరణ నిరాహా రదీక్ష చేసిన కుమారస్వామిని ఉద్యమ నేతగా కేసీఆర్ స్వయంగా ములుగుకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ పోరాట ఫలితంగానే డీఫ్లోరైడ్ ప్రాజెక్టు మంజూరైం ది. ములుగు మండలంలోని భాగ్య తండా గ్రామం అగ్ని ప్రమాదంలో కాలిబూడిద కాగా బాధితులకు అండగా నిలబడ్డారు. కేసీఆర్‌ను తీసుకొచ్చి నిరాశ్రయులకు భరో సానిప్పించారు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఆర్థికసాయం చేశారు. ఈ సంఘ టన స్ఫూర్తిగా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పలు వేదికలపై కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మాస్ లీడర్‌గా అందరి మన్ననలు పొందిన కుమారస్వామి మరణంతో జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొంది.