దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2023-01-09T00:11:13+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక ప్రత్యేక కార్య క్రమాలు రూపొందించిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంధుల ఆరాధ్యదైవం డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 214వ జయంతి వేడుకలను హనుమకొండలోని జిల్లా పరిషత్‌ హాలులో ఘనంగా నిర్వహించారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జిల్లా పరిషత్‌ హాలులో అంధులతో కేక్‌ కట్‌ చేయిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హనుమకొండ రూరల్‌, జనవరి 8: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక ప్రత్యేక కార్య క్రమాలు రూపొందించిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ అంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంధుల ఆరాధ్యదైవం డాక్టర్‌ లూయిస్‌ బ్రెయిలీ 214వ జయంతి వేడుకలను హనుమకొండలోని జిల్లా పరిషత్‌ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లూయిస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లా డుతూ.. అన్ని జిల్లా కేంద్రాల్లో లూయిస్‌ బ్రెయిలీ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు చేపట్టే విధంగా సంబం ధిత శాఖ అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. మూడు, నాలుగేళ్లుగా బ్రెయిలీ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నప్పటికీ రాలేకపో యానని, కానీ ఈసారి ఎట్టిపరిస్థితుల్లో రావాలని నిర్ణ యించుకొని వచ్చినట్లు మంత్రి చెప్పారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేయాలన్న వారి కోరికను పరిగణలోకి తీసుకొని చర్చిస్తామని హామీ ఇచ్చారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. వచ్చే లూయిస్‌ బ్రెయిలీ జయంతి వరకు హనుమకొండలో ఆయన విగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని దివ్యాంగులను కొనియాడారు. అంధులకు ప్రపంచం అంధకారం అయినప్పటకీ బ్రెయిలీ రూపొందించిన లిపితో ప్రపంచాన్ని జయిస్తున్నారని అన్నారు. సామాన్యుల వలే దివ్యాంగులు కూడా విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించడం గొప్ప విషయమని అన్నారు.

వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వికలాంగులు అంటే చిన్నచూపు ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వికలాంగులకు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశా రన్నారు. కోట్లాది రూపాయలతో ఉపకరణాలు కూడా అందించారన్నారు. జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌, ‘కుడా’ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌, సీడబ్ల్యూసీ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.అనితారెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్‌, కృష్ణ, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T00:11:14+05:30 IST