24 గంటలు అందుబాటులో వైద్యసేవలు
ABN , First Publish Date - 2023-07-29T01:18:13+05:30 IST
జిల్లాలో 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తారని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ తెలిపారు. మహబూబాబాద్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశారు.
జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్
మహబూబాబాద్ టౌన్, జూలై 28: జిల్లాలో 24 గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తారని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ తెలిపారు. మహబూబాబాద్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశారు. వైద్యాధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గర్భిణులను సమీపంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో చేర్పించడంపై వైద్యాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హరీష్‌రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్పించాలన్నారు. ఏ ఒక్కరికి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వెంటనే పీహెచ్‌సీ వైద్యాధికారికి తెలియజేయాలని చెప్పారు. ఆరోగ్య సలహాలు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి 9676621992 నంబరుకు కాల్ చేసి సాయం పొందాలని సూచించారు. ప్రజలెవ్వరూ అధైర్యపడవద్దని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో అంబరీష పాల్గొన్నారు.