ఎక్కడ చూసినా ఒక్కరే..!
ABN , First Publish Date - 2023-02-21T01:55:10+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అతి తక్కువగా నమోదు అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక, ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్న, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పి అందుకు తగినట్లుగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టగా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు రాక వెలవెల బోతున్నాయనే బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 199 పాఠశాలల్లో సింగిల్ టీచర్లే..
కొన్ని స్కూళ్లల్లో వసతులున్నా విద్యార్థులు కరువు
ప్రభుత్వ పాఠశాలలు నడిచేదెలా...?
‘మన ఊరు-మన బడి’తో నైనా పరిస్థితి మారేనా..?
మరిపెడరూరల్ /మహ బూబాబాద్ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 20 : ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అతి తక్కువగా నమోదు అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక, ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్న, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పి అందుకు తగినట్లుగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టగా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు రాక వెలవెల బోతున్నాయనే బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 897 ప్రభుత్వ పాఠశాలలు...
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు -101, ప్రాథమికోన్నత పాఠశాలలు-120, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు- 676 వెరసీ మొత్తం 897 ఉన్నాయి. వాటిల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో 46 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతంలో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు నమోదు కాకపోవడంతో విడు తల వారిగా కొన్ని పీఎస్‌లను మూసివేశారు. మూసివేసిన పాఠశాలలు పోగా మిగిలిన పాఠశాలల్లోను గరిష్ట పాఠ శాలల్లో విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10లోపే ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి తక్కువగా పిల్లలున్న పాఠశాలల్లో బోధించే కొందరు ఉపాధ్యాయులు తాము తీసుకుంటున్న వేతనాలకు, చేస్తున్న పనికి ఏ మాత్రం సంబందం ఉండడం లేదని వాపోతున్నారు. తక్కువ విద్యార్థులున్న పీఎస్‌లను సమీప కాంపెక్స్ పాఠశాలల్లో విలీనం చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నట్లు సమాచారం.
ఒక టీచర్ 18 సబ్టెక్టులు బోధించటం ఎలా సాధ్యం...?
జిల్లాలో 199 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సింగిల్ టీచర్‌లు 1వ నుంచి 5 తరగతుల వి ద్యార్థులకు విద్యాశాఖ రూపొందించిన క్యాలెండర్ ప్రకారం బోధన చేయటం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలె త్తుతున్నాయి. 1, 2వ తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, గణి తం (ఆరు సబ్జెక్టులు) 3, 4, 5 తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞానం, గణితం (12 సబ్జెక్టులు) వెరసీ మొత్తం 18 సబ్జెక్టులను ఒకే టీచర్ ఎలా బోధించి విద్యార్థులకు ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల ను పూర్తి చేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల నిర్వహణతో పాటు విద్యాశాఖ ప్రవేశపెడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అనేక మానసిక వత్తిడి గురవుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
199 పాఠశాలల్లో సింగిల్ టీచర్లే...
మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి 16 మండలాల్లో 676 ప్రాథమిక పాఠశాల లుండగా వాటిల్లో 199 పాఠశాలల్లో సింగిల్ ఉపాధ్యాయులే బోధన చేయడం గమనార్హం. కొత్తగూడ మండలంలో-11, గంగారం-10, బయ్యారం-11, గార్ల-13, డోర్నకల్ -10, కురవి-12, మహబూబాబాద్-21, గూడూరు-14, కేసముద్రం-22, నెల్లికుదురు-17, నర్సింహులపేట-17, చిన్నగూడూరు-6, మరిపెడ-28, దంతాలపల్లి-5, తొర్రూరు-2, పెద్దవంగర-6 వెరసీ ఉమ్మడి 16 మండలాల పరిధిలో 199 ప్రాథమిక పాఠశాలల్లో సింగిల్ టీచర్లే విధులు నిర్వర్తిస్తున్నారు.
విద్యార్థుల నమోదు తక్కువకు కారణమేంటి...?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువ కావడానికి అనేక కారణాలు ఉన్నా యనే ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్నా భోజన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. తాజాగా ప్రభు త్వం మన ఊరు- మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 316 పాఠశాలలను ఎంపిక చేసి సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తగు కృషి చేసి, పాఠ శాలల్లో విద్యార్థుల నమోదు పెంచేలా కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక బోసిపోయి ఉండగా, గురుకులాలు, మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను వడబోసి గురుకులాల్లో చేర్చుకుంటున్న పరిస్థితి ఉంది.