మరిపెడ పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌

ABN , First Publish Date - 2023-07-29T01:21:36+05:30 IST

మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీ చేశారు.

మరిపెడ పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌
మరిపెడ పీహెచ్‌సీ

ఆరు నుంచి వంద పడకలకు పెంపు

వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీ

మరిపెడ, జూలై 28: మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆస్పత్రిని ఆరు పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు అందుకు తగిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ నుంచి రూ.36 కోట్లను కేటాయించడం జరిగింది. పనులు త్వరితగతిన చేపట్టాలని సంబంధిత జిల్లా అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ ఆదేశించారు.

Updated Date - 2023-07-29T01:21:36+05:30 IST