వరంగల్‌ నగరానికి మరో వన్నె...

ABN , First Publish Date - 2023-01-26T00:46:23+05:30 IST

నగర అందాల సిగ లో మరో హుంగు చేరిం ది. నగరంలోని పర్యాటక ప్రాంతమైన భద్రకాళి బండ్‌పై 150 అడుగుల ఎత్తు గల జాతీయ జెండాను జీడబ్ల్యుఎంసీ ఏర్పాటు చేసింది. రూ.25.50 కోట్ల వ్యయంతో ఈ జెండాను నిర్మించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అ త్యంత ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు జరిగినా, హైదరాబాద్‌ తదుపరి 150 అడుగుల ఎత్తులో నిర్మితమైనది వరంగల్‌లోనే కావడం విశేషం.

వరంగల్‌ నగరానికి మరో వన్నె...
భద్రకాళి బండ్‌పై ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండా

రూ.25.50 లక్షలతో నిర్మాణం... నేడు ఆవిష్కరణ

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 25: నగర అందాల సిగ లో మరో హుంగు చేరిం ది. నగరంలోని పర్యాటక ప్రాంతమైన భద్రకాళి బండ్‌పై 150 అడుగుల ఎత్తు గల జాతీయ జెండాను జీడబ్ల్యుఎంసీ ఏర్పాటు చేసింది. రూ.25.50 కోట్ల వ్యయంతో ఈ జెండాను నిర్మించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అ త్యంత ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు జరిగినా, హైదరాబాద్‌ తదుపరి 150 అడుగుల ఎత్తులో నిర్మితమైనది వరంగల్‌లోనే కావడం విశేషం.

నేడు ఆవిష్కరణ

ఈ భారీ జెండాను రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారం ఆవిష్కరిం చనున్నారు. ఎలక్ర్టిక్‌ మోటార్‌ ద్వారా పతాకాన్ని పైకి చేర్చి ఆవిష్కరిస్తారు. జెండా పైకి వెళ్లడానికి పది నిమిషాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే జాతీయజెండా 150 ఎత్తులోకి వెళ్లడం జరుగుతుంది. బుధవారం రాత్రి వరకు జీడబ్ల్యూఎంసీ అధికారులు ట్రయల్‌ రన్‌ చేశారు.

మేయర్‌, కమిషనర్‌ పరిశీలన

మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీ ణ్య బుధవారం జాతీయ జెండా గద్దె నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం గణతంత్ర దినోత్సవ క్రమంలో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రారంభించనున్నారు.

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

కలెక్టరేట్‌లో జెండా ఎగరేయనున్న కలెక్టర్‌

హనుమకొండ రూరల్‌, జనవరి 25: రిపబ్లిక్‌ డే వేడుకలు గురువారం హనుమకొండ కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్త య్యాయి. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రసంశాపత్రాల ప్రదానం ఉంటుంది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 210 మంది ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు.

Updated Date - 2023-01-26T00:46:24+05:30 IST