Share News

ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు!

ABN , First Publish Date - 2023-12-01T23:28:06+05:30 IST

ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్‌ ఘట్టం గురువా రంతో ముగిసింది. పోలింగ్‌ ముగియడంతో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు కొంత ఊరట చెం దారు.

ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు!

సమీక్షించుకుంటున్న అభ్యర్థులు

బయటపడతామా? లేదా? అని ఆందోళన

మనమే గెలుస్తున్నామంటూ పార్టీ శ్రేణులకు భరోసా

జనగామ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియలో అతి కీలకమైన పోలింగ్‌ ఘట్టం గురువా రంతో ముగిసింది. పోలింగ్‌ ముగియడంతో ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు కొంత ఊరట చెం దారు. కానీ.. కౌంటింగ్‌ ఘట్టం ముందుండడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి. తాము గెలుస్తామా లేదా? అన్న సందేహాల్లో అభ్యర్థులు ఉన్నారు. జిల్లా పరిధి లోని జనగామ, స్టేషన్‌ఘ న్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో ప్రధానం గా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే తీవ్ర పోటీ నెలకొ న్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు మాత్రం కచ్చితంగా ఉత్కంఠగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌ తీరుపై అటు ఇంటలిజెన్స్‌ వర్గాలు, ప్రైవేటు సర్వే సంస్థలు చేసిన సర్వేలోనూ, ఇటు అభ్యర్థుల సొంత అంచనా ల్లోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉందని తేలినట్లు సమాచారం. జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఓటరు తీర్పు దాదాపుగా స్పష్టమ వుతున్నప్పటికీ మరో రెండు ని యోజకవర్గాల్లో మాత్రం అటా ఇటా అన్నట్లుగా ఉందని తెలు స్తోంది. దీంతో ఆ నియోజకవ ర్గాల్లో బరిలో ఉన్న ప్రధాన పార్టీ ల అభ్యర్థులు క్షణమొక యుగం లా గడుపుతున్నారని సమాచారం. గురువారం పోలింగ్‌ పూర్తవడం తోనే అభ్యర్థులు తమ తమ అంచనాల్లో మునిగిపోయి నట్లు తెలుస్తోంది. కాగా.. నియోజక వర్గాల వారీగా ఆయా పార్టీల అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశా లు ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిపై సమీక్ష చేసుకుం టున్నారు. మండలాల వారీగా ఏ మండలంలో లీడ్‌ ఇస్తుందనే లెక్కల్లో అభ్యర్థులు మునిగి తేలుతున్నారు. ప్రచారంలో, ఓటర్లకు డబ్బుల పంపిణీలో తమ ప్లస్‌లు, మైనస్‌లను రివ్యూ చేసుకునే పనిలో పడ్డారు.

మనమే గెలుస్తున్నాం..

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ ల మధ్య గట్టి పోటీ ఉండగా అభ్యర్థులు ఎవరి ధీమా లో వారు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మనమే గెలు స్తున్నామంటూ పార్టీ నాయకులకు భరోసా ఇస్తు న్నారు. నియోజకవర్గంలో గెలుపు తమ పార్టీదే అంటూ ఎవరికి వారే తమ పార్టీ అధిష్టానా నికి సైతం ధీమాతో చెప్పినట్లు తెలుస్తోంది. ఓటమి తప్పదేమోనని భావి స్తున్న అభ్య ర్థులు సైతం కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం కోసం గెలుపు రాగం అందుకుంటున్నారు. ప్రజల తీర్పు మనవైపే ఉందని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

అభ్యర్థులకు ‘బొక్క’

ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులకు సొంత పార్టీ నేతలే ‘బొక్క’ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ‘సందెట్లో సడేమియా’ అన్న చందంగా ఓటర్లకు పంచడానికి ఇచ్చిన డబ్బులను కొన్ని చోట్ల కింది స్థాయి నేతలే నొక్కినట్లుగా గుసగుసలు వినిపి స్తున్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలో 28వ తేదీ ఉదయం నుంచే ఓటర్లకు నగదు పంపిణీ ప్రారం భం కాగా 29 నాడు ఊపందుకుంది. మొదట్లో సక్ర మం గానే పంపిణీ చేయగా చివరి వచ్చే సరికి పంపి ణీలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జిల్లాలో పలు చోట్ల తమకు డబ్బులు రాలేదంటూ ఓటర్లు బహిరం గంగానే ఆయా పార్టీల నేతలను కడిగేశారు. కొడకండ్ల మండలకేంద్రంలో తమకు డబ్బులు ఇవ్వలే దంటూ ఆలస్యంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. జన గామ పట్టణంలోనూ ఓ పార్టీకి చెందిన నేతలు ఓటర్ల కు డబ్బులు ఇవ్వకపోవడంతో ఓటర్లు ప్రశ్నించారు. దీంతో మరో నేత జోక్యం చేసుకొని ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి వచ్చే ఓటర్లకు ఓటుకు ఇచ్చే డబ్బుతో పాటు రవాణా చార్జీలు సైతం ఇస్తామ ని ఆయా పార్టీలు ఆఫర్‌ ఇచ్చాయి. కానీ తీరా ఓటేయ డానికి ఊరికి రాగానే తమను పిలిపించిన నేత మొఖం చాటేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అభ్యర్థుల నుంచి ఓటరు వారీగా డబ్బులు సక్రమంగానే వచ్చినప్పటికీ కింది స్థాయి నేతలే మెక్కినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-12-01T23:28:17+05:30 IST