నిరుపేదలకు ‘గృహలక్ష్మి’

ABN , First Publish Date - 2023-03-13T00:14:19+05:30 IST

సొంత స్థలం కలిగి ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. సొంత ఇంటికోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న పేదల్లో కూడా సంతోషం వ్యక్తమవు తోంది. కొద్దిపాటి స్థలం ఉన్నవారు.. అందులో చిన్నపాటి గూడు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ఈ రూ.3లక్షలు సరిపోకపోయినా, మరి కొంత జమ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చనే ధీమా వారిలో కలుగుతోంది.

నిరుపేదలకు ‘గృహలక్ష్మి’

నెరవేరనున్న సొంతింటి కల

స్థలం ఉంటే రూ.3 లక్షల సాయం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 36వేల మందికి లబ్ధి

రుణాలకు రూ.1,080కోట్లు అవసరం

మార్గదర్శకాలు రాగానే దరఖాస్తుల ఆహ్వానం

ఇళ్ల స్థలాలపై సర్వే.. కలెక్టర్లకే బాధ్యతలు

రద్దుకానున్న రూ.320కోట్ల పాత బకాయిలు

సొంత స్థలం కలిగి ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. సొంత ఇంటికోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న పేదల్లో కూడా సంతోషం వ్యక్తమవు తోంది. కొద్దిపాటి స్థలం ఉన్నవారు.. అందులో చిన్నపాటి గూడు కట్టుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ఈ రూ.3లక్షలు సరిపోకపోయినా, మరి కొంత జమ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చనే ధీమా వారిలో కలుగుతోంది.

హనుమకొండ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పలు పథకాలు పక్కా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగమే ఈ గృహలక్ష్మి పథకం. కొద్దోగొప్పో ఈ పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు లాభ దా యకంగా ఉండగలదన్న అభిప్రాయం వ్యక్తం అవు తోంది. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై స్పష్టమైన మార్గదర్శకాలు రాగానే అధికారులు దరఖా స్తులను ఆహ్వానించనున్నారు. ఆ మార్గ దర్శకాలు ఎలా ఉంటా యన్నదాని పైనే సర్వత్రా ఆసక్తి రేకేత్తుతోం ది. పథకం అమలుకు ప్రభు త్వం పెట్టే షరతుల పరిధిలోకి తాము రాగలమా..? అర్హత లభించగలదా..? అన్న మీమాంస సొంత స్థలం కలిగినవారిలో కలుగుతోంది.

కలెక్టర్లకే బాధ్యతలు

గృహలక్ష్మి పథకం అమలుపై సమగ్ర పర్యవేక్షణ జిల్లా కలెక్టర్లకే ప్రభుత్వం అప్పగిం చింది. రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీని సైతం ప్రస్తుతం కలెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. మార్గదర్శకాలు జారీ అయిన తర్వాత వాటికి లోబడి వచ్చే దరఖా స్తులను పరిశీలన కోసం సంబంధిత తహసీల్దార్లకు, మున్సిపాలిటీల పరిధిలో అయితే పట్టణ ప్రణాళికాశాఖ అధికారులకు అప్పగిస్తారు. వీరు దరఖాస్తుదారులైన మహిళల పేరు మీద వాస్తవంగా స్థలం ఉందా? ఎంత విస్తీర్ణంలో ఉంది? అది చట్టబద్ధమైందేనా, రిజిస్ట్రేషన్‌ సం బంధిత పత్రాలు ఉన్నాయా? దరఖాస్తుదారు సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, ఇది వరకే సొంత ఇల్లు ఉందా..? లేదా అనే విషయాలపై పరిశీలన జరిపి కలెక్టర్లకు నివేదికను అందచేస్తారు.

వివరాల సేకరణ

ప్రభుత్వం ఇంతవరకు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణా ల కోసం ఎన్ని ఎకరాలు సేకరించిం ది? వాటిలో ఎంత మంది ఇళ్లను నిర్మించుకున్నారు? ఎన్ని ఖాళీ స్థలా లు ఉన్నాయి? వంటివాటిపై లెక్క లు తేల్చాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాల్లో కార్యదర్శుల నుంచి మండల స్థాయి రెవెన్యూ స్థాయి అధికారులు లెక్కలు తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయి నివే దికలు వారంలో ఇవ్వాలని సూచిం చారు. పట్టణాలు, మండలాల్లో ఖాళీ స్థలాల లభ్యత ఇబ్బందిగా ఉంది. వీటిపై పది రోజుల్లో స్పష్టత రానున్నది.

అమలు బాధ్యత ఏ శాఖకు?

ప్రస్తుతం హౌసింగ్‌ శాఖను ఎత్తివేశారు. ఆ శాఖ అధికారులు, సిబ్బందిని వేరే శాఖల్లో విలీనం చేశారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యత ను పంచాయతీరాజ్‌, రహదా రులు, రోడ్లు భవనాల శాఖ లకు అప్పగించారు. గృహలక్ష్మి పథకం అమలును కూడా ప్రస్తుతం రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను చూ స్తున్న నిర్మిస్తున్న రహదా రు లు భవనాల శాఖకు అప్పగి స్తారా అన్నదానిపై స్పష్టత ఇంకా రాలేదు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదా రులకు ఆర్థిక సాయం మంజూరు చేయడమే కీలకం కనుక ఆ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించవచ్చునని తెలుస్తోంది.

రూ.1,080కోట్లు

ప్రతీ నియోజకవర్గానికి గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఇళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అర్హులకు ఆర్థికసాయాన్ని మూడు విడతల్లో ఇవ్వనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో 36వేల ఇళ్లు రాను న్నాయి. ఇందుకు రూ.1,080కోట్లు అవసరమవుతాయి. ఇప్పటి కే అన్ని జిల్లాలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణా లు కొనసాగుతున్నా లబ్ధిదారులు ఎంపిక కొలిక్కిరా లేదు. దీంతో గృహలక్ష్మిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకంలో ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల పరిమితి విధించినా క్షేత్రస్థాయిలో ఇళ్లకోసం దరఖాస్తులు చేసు కునే లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.

3వేల ఇళ్లు సరిపోవు..

గృహలక్ష్మి పథకం కింద ప్రస్తుతం నియోజకవ ర్గానికి 3వేల మందికి ఆర్థికసాయం చేయాలని ప్రభు త్వం ప్రకటన చేయడంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో కొంతమందికే రెండు పడ కల గదుల ఇళ్లు లభించాయి. చాలామంది దరఖాస్తు చేసి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మూడు వేల మందికే ఇస్తే చాలామంది పార్టీకి, వ్యక్తిగతంగా అధి కార పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకమయ్యే అవకాశాలు న్నాయి. వీలైనంత ఎక్కువ మందికి ఆర్థికసాయం చేయాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతీ సోమవారం జిల్లాకేంద్రాలతో పాటు మండల, డివిజన్‌ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో 60 శాతానికిపైగా ప్రజలు తమకు సొంతింటిని కేటా యించాలనే ధరఖాస్తులు చేస్తున్నారు. ఈ నెలాఖారు లోగా ఈ పథకంపై స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

పాత దరఖాస్తులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇళ్లు కా వాలని గతంలోనే దరఖాస్తులు చేసు కున్న లబ్ధిదారులు 25వేల మందికిపైనే ఉన్నారు. వీరందరూ ప్రజావాణి, హౌసింగ్‌ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ల వద్ద ఈ అర్జీలను సమర్పించుకున్నా రు. దరఖాస్తులను ఆయా శాఖలవారు విచారణ చేయాలని తహసీల్దార్లకు పంపించారు. ఇప్పుడు వాటిని పరిగణ లోకి తీసుకుంటారా? లేదా అనే అంశం పై స్పష్టత లేదు. కొత్తగా దరఖాస్తులతో పాటు ఈ పాత అర్జీలను కూడా పరిగణ లోకి తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టం కావలసి ఉంది. ఒక్కో గ్రామంలో ఇల్లు లేని పేదలు సుమారు 100 నుంచి 400 వరకు ఉన్నారు.

రూ.320కోట్లు మాఫీ

ప్రభుత్వ తాజా ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న రుణాలు మొత్తం మాఫీ కానున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, రూరల్‌ పర్మినెంట్‌ హౌస్‌ (యూపీహెచ్‌), రచ్చబండ, అర్బన్‌ హౌసింగ్‌ పథకాలు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి రుణ సదుపాయం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలను అందచేసింది. ఏటా వాయిదాల రూపంలో తిరిగి డబ్బులు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. పేదలు వాటిని కట్టకపోవడంతో అప్పులు పేరుకుపోయాయి. రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 72వేల మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు రూ.320 కోట్ల రుణ బకాయిలు రద్దు కానున్నాయి..

Updated Date - 2023-03-13T00:14:19+05:30 IST