ఓటెత్తారు..!
ABN , First Publish Date - 2023-12-01T00:19:59+05:30 IST
జనగామ జిల్లాలో ఓటర్లు పోటెత్తారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూ ర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క జనగా మ పట్టణం, జనగామ మండలం శామీర్‌పేట గ్రామా లు మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
జిల్లాలో భారీగా నమోదైన పోలింగ్
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
పోలీసుల పకడ్బందీ బందోబస్తు
పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు..
ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ
జనగామ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో ఓటర్లు పోటెత్తారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూ ర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క జనగా మ పట్టణం, జనగామ మండలం శామీర్‌పేట గ్రామా లు మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యం అయింది. పోలింగ్ సిబ్బంది సరిచేయడంతో ఒక్కో చోట అరగంట నుంచి గంట సమ యం ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. మధ్యా హ్నం ఒంటి గంట తర్వాత నుంచి పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగియ గా అప్పటి వరకు పోలింగ్ కేంద్రం గేటు లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
పోలీసుల పటిష్ట బందోబస్తు
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే వారిని ఒకొక్కరిని చెక్ చేసి లోపలికి పంపించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ఆ యా పార్టీల నాయకులను కట్టడి చేశారు. సివిల్ పోలీసులు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎ్‌సఎఫ్), తెలంగాణ స్పెషల్ పోలీస్, కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్, ఎక్సైజ్ పోలీస్ విభాగాలకు చెందిన సీఐలు, ఎస్సైలు, కా నిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు పోలీస్ అకాడమీకి చెందిన ట్రైనీ ఎస్సైలతో కూడిన 1306 మంది పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో అన్ని వ్యాపార, వాణిజ్య సం స్థలను, దుకాణాలను పోలీసులు మూసి వేయించారు.
పోలింగ్‌పై నిఘా
పోలింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు. కలెక్టరేట్‌లోని వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. కమాండ్ కంట్రో ల్ సెంటర్ ద్వారా పోలింగ్ ప్రక్రియలో లోపాలను అడిగి తెలుసుకొని సిబ్బందికి సూచనలు చేశారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ప్రారంభించే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈవీఎంలు పనిచేయలేదు. సాంకేతిక నిపుణుల మర మ్మతు చేసిన తర్వాత పోలింగ్‌ను ఆలస్యం గా ప్రారంభించారు. దీంతో అరగంట నుంచి గంట ఆలస్యంగా పోలిం గ్ ప్రారంభమైంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లోని బూత్ నంబర్ 147, 148, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బూత్ నంబర్ 114లో ఈవీఎంలు మొరాయించగా 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయింది. అదే విధంగా బచ్చన్నపేట మండ లం కొన్నె గ్రామంలోని బూత్ నంబర్ 115లో, జనగామ పట్టణంలోని ధర్మకంచలో, చిల్పూరు మండలం రాజవరం, మల్కాపూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి.
దివ్యాంగులకు వీల్‌చైర్‌లు
దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులను ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చారు. పోలింగ్ బూత్‌లోకి వీల్‌చైర్ల ద్వారా తీసుకెళ్లి ఓటు వేసిన తర్వాత తిరిగి పంపించారు. కేంద్రాల వద్ద ఓటర్ల కోసం తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఓట్లు వేసిన ప్రముఖులు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో పలు పార్టీల అభ్యర్థులు, పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామ మండలం ఎల్లంల గ్రామంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, జిల్లాకేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత్‌రెడ్డి, బచ్చన్నపేట మండలకేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ఓటు వేశా రు. అదే విధంగా స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి హనుమకొండలోని టీచర్స్ కాలనీలో, కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర స్టేషన్‌ఘన్‌పూర్‌లో, బీజేపీ అభ్యర్థి గుండె విజయరామారావు ధర్మసాగర్ మండలం కమ్మర్‌పేటలో, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో, ఎమ్మె ల్యే తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓటు వేశా రు. పాలకుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో ఓటు వేశా రు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా డిండి చింతపల్లిలో, బీజేపీ అభ్యర్థి లేగ రామ్మోహన్‌రెడ్డి దేవరుప్పుల మండలం నీర్మాలలో, మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్‌రావు పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.