Hyderabad: ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-01-25T16:02:58+05:30 IST

హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఉన్న భద్రత యథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది.

Hyderabad: ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) సోదరుడు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌ (Errabelli Pradeep Rao)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. గతంలో ఉన్న భద్రత యథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రత తొలగించారని.. హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్ పిటిషన్ వేశారు. ఎందుకు తొలగించారో తెలియదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని 2+2 భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

Updated Date - 2023-01-25T16:03:01+05:30 IST