విద్యా హబ్‌.. నర్సంపేట

ABN , First Publish Date - 2023-07-06T00:54:26+05:30 IST

నియోజవర్గ కేంద్రమైన నర్సం పేట పట్టణం విద్యాకేంద్రాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే నర్సంపేట మండలంలో రెండు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

విద్యా హబ్‌.. నర్సంపేట

మెడికల్‌ కళాశాల రాకతో మరింత పురోగతి

ఇప్పటికే మండలంలో రెండు ఇంజనీరింగ్‌ కాలేజీలు

అశోక్‌నగర్‌లో కొనసాగుతున్న సైనిక్‌ స్కూల్‌

ఎడ్యుకేషన్‌, వైద్య కేంద్రంగా పట్టణ అభివృద్ధి

స్థానికులకు డాక్టరు కోర్సు చదివే అవకాశం

నెరవేరనున్న పేద విద్యార్థుల కల

తల్లిదండ్రులకు తప్పనున్న ఇబ్బందులు

నర్సంపేట, జూలై 5 : నియోజవర్గ కేంద్రమైన నర్సం పేట పట్టణం విద్యాకేంద్రాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే నర్సంపేట మండలంలో రెండు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ క్రమంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వైద్య పరంగా మరింత అభివృద్ధి చెంద నుంది. పేదలు కూడా డాక్టర్‌ కోర్సును చేసే అపూ ర్వమైన అవకాశం రానుంది. దూర ప్రాంతాలకు వెళ్లకుం డా స్థానికంగా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యను విద్యార్థులు అభ్యసించేస్థాయికి నర్సంపేట చేరుకుందనడంలో సందేహం లేదు.

నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఇప్పటికే సైనిక్‌ స్కూల్‌ కొనసాగుతోంది. తొమ్మిది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో సుమారు 7వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న విద్యనభ్యసించడానికి వరంగల్‌, హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లే వారు. లక్షలాది రూపాయలు వెచ్చింది, పిల్లలను చదివించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు నానా ఇబ్బందులను ఎదుర్కొరేవారు.

నర్సంపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మెడికల్‌ కళాశాలలను, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు గతంలో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేటను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో సైనిక్‌స్కూల్‌, గురుకులాల మంజూరు చేయించుకొచ్చారు. విద్యార్థులకు ఉన్నత విద్యాఅవకాశాలను కల్పించారు. నర్సంపేటకు ఆయ న మరో విద్యామణిహారాన్ని సాధించుకొచ్చారు.

రాష్ట్రప్రభుత్వం మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడంతో పేదవిద్యార్థులు ఎంబీబీఎస్‌ స్థానికంగా చదుతుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. నర్సంపేటకు మంజూరైన మెడికల్‌ కాలేజీలో ఏటా 100 మంది వైద్యవిద్యను అభ్యసించే అవకాశాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలోని గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చదువాలన్న ఆకాంక్ష ఉన్నా తల్లిదండ్రు లకు ప్రైవేటు కళాశాలలో చదివించే స్తోమత లేక చాలామంది పేద విద్యా ర్థులు వెనకడుగువేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు మణిహారంగా నర్సంపేటకు మంజూరైన మెడికల్‌ కాలేజీ మణిహారంగా మారనుంది.

పేద విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదివే అవకాన్ని కేసీఆర్‌ ద్వారా నర్సంపేట ప్రాంత విద్యార్థులకు కల్పించేదుకు కృషి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విద్యారంగంతో పాటు వైద్యరంగంలో నర్సంపేట హెల్త్‌ హబ్‌గా గుర్తింపు పొందనుంది. ఎమ్మెల్యే కృషివల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం, డయాలసిస్‌ సెంటర్‌లు కొన్ని సంవత్సరాల క్రితమే మంజూరై, రోగులకు సేవలందిస్తున్నాయి.

రూ.70 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం..

నర్సంపేటలో రూ.కోటి 25 లక్షలతో నిర్మించిన డయాగ్నస్టిక్‌ హబ్‌ నూతన భవనాన్ని వర్చువల్‌ ద్వారా మంత్రి హరీశ్‌రావు ఈనెల 1న ప్రారంభించారు. ఈ హబ్‌లో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. రూ.70 కోట్లతో పట్టణ శివారులో 250 పడకల జిల్లా ఆస్పత్రి నిర్మాణ పను లు ఇప్పటికే కొన సాగుతున్నాయి. 49 హెల్త్‌ సబ్‌సెంటర్లు మంజూరయ్యాయి. పల్లె దవఖానాలు పని చేస్తున్నాయి. మొత్తంగా నర్సంపేట విద్యాకేం ద్రంగా భాసిల్లుతోందడనంలో సందేహం లేదు.

వైద్య కళాశాల మంజూరు..

వంద సీట్ల కేటాయింపు

జీవో 83ను జారీ చేసిన సర్కారు

పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం

నర్సంపేట, జూలై 5 : వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నర్సంపేటలో స్థాపించే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు రాష్ట్ర సర్కారు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో 83ను బుధవారం జారీ చేసింది. ఈ వైద్య కళాశాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతులను ఇచ్చింది. ఈనెల 1వ తేదీ నరూ.కోటి 25 లక్షలతో నిర్మించిన గయోగ్నస్టిక్‌ హబ్‌ను వర్చువల్‌ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన సందర్భంగా నర్సంపేటకు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీని మంజూరు చేస్తుందని తెలిపారు. మంత్రి చెప్పిన విధంగానే నర్సంపేటకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దీంతో గత సంవత్స రాలుగా మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు పెద్ది కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం..

నర్సంపేటకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 83ను జారీ చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో బీఆర్‌ఎస్‌ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్రకమిటీ సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గుంటి కిషన్‌, సొసైటీ చైర్మన్‌ మొరాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బాణాసంచాకాల్సి, స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీ్‌షరావు, కేటీఆర్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాబి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్‌ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్‌, నాగిశెట్టి ప్రసాద్‌, మండల శ్రీనివాస్‌. గంపరాజేశ్వర్‌, ఆబోతు రాజు, రాయరాకుల శ్రీనివాస్‌, సారంగం, పుల్లూరి స్వామి, కౌన్సిలర్‌ బానాల ఇందిర పాల్గొన్నారు.

Updated Date - 2023-07-06T00:54:26+05:30 IST